![]() |
![]() |

ఫలితంతో సంబంధం లేకుండా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ప్రత్యేక స్థానం పొందే చిత్రాల్లో దేవీపుత్రుడు ఒకటి. ఫాంటసీ డ్రామగా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకీ రెండు విభిన్న పాత్రల్లో దర్శనమిచ్చారు. బలరామ్, కృష్ణ.. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రల్లో కనిపించారాయన. బలరామ్ పాత్ర ఆర్కియాలజిస్ట్ కాగా.. కృష్ణ ఏమో ఒక దొంగ. అయితే ఈ రెండు పాత్రలకి ఎలాంటి బంధుత్వం ఉండదు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తనదైన అభినయంతో తెరపై చక్కగా ప్రదర్శించారు వెంకీ.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తన కెరీర్ మొత్తమ్మీద వెంకీ కేవలం ఏడు చిత్రాల్లోనే ద్విపాత్రాభినయం చేయగా.. అందులో ఐదో సినిమా దేవీపుత్రుడు. అగ్గిరాముడు (1990), పోకిరి రాజా (1995), సూర్య వంశం (1998), జయం మనదేరా (2000) చిత్రాల్లో అప్పటికే ద్విపాత్రాభినయం చేసిన వెంకీ.. దేవీపుత్రుడులో డ్యూయెల్ రోల్స్ ని చాలా ఈజ్ తో చేశారు. ఆపై సుభాష్ చంద్ర బోస్ (2005), నాగవల్లి (2010) సినిమాల్లోనూ రెండేసి పాత్రల్లో దర్శనమిచ్చారు విక్టరీ వెంకటేష్.
![]() |
![]() |