![]() |
![]() |

విక్టరీ వెంకటేష్ నటించిన గురు(2017) చిత్రంతో తెలుగునాట సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు దర్శకురాలు సుధ కొంగర. లెజండరీ డైరెక్టర్ మణిరత్నంకి శిష్యురాలైన సుధ స్వతహాగా తెలుగింటి పడతి అయినా.. తమిళనాటే డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. తక్కువ కాలంలోనే రెండు వేర్వేరు ఓటీటీ వేదికల్లో ఓవరాల్ గా హ్యాట్రిక్ విజయాలు చూశారు సుధ. అది కూడా.. నెలకో ఓటీటీ హిట్ తన ఖాతాలో పడడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. 2020 అక్టోబర్ 16న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన పుత్తమ్ పుదు కాలై అనే ఆంథాలజీలో ఇళమై ఇదో ఇదో అనే షార్ట్ ఫిల్మ్ ని తెరకెక్కించారు సుధ. ఈ ఆంథాలజీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక 2020 నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమ్ అయిన సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రం సౌత్ ఇండియాలోనే తొలి ఓటీటీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే 2020 డిసెంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న పావ కథైగళ్ ఆంథాలజీలో తంగమ్ అనే షార్ట్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేశారు సుధ. ఈ ఆంథాలజీకి కూడా అటు విమర్శకులు, ఇటు వీక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మొత్తమ్మీద.. నెలకో ఓటీటీ హిట్ తో సుధ టాప్ ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. అలాగే.. వరుస నెలల్లో వరుస విజయాలతో సుధ హ్యాట్రిక్ చూసినట్లయ్యింది.
![]() |
![]() |