కొవిడ్-19తో పోరాడుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దాని నుంచి క్షేమంగా బయటపడ్డారు. తనకు లేటెస్ట్‌గా టెస్ట్‌లో నెగటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రకటించారు. తనకు ప్రేమను పంచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఓ నోట్‌ను షేర్ చేశారు. "హలో ఎవిరివన్! 15 రోజుల క్వారంటైన్ అనంతరం నేను టెస్ట్‌లో నెగటివ్‌గా తేలింది. నాకు విషెస్ చెప్పిన, నా కోసం ప్రార్థించిన శ్రేయోభిలాషులు, అభిమానులందరికీ థాంక్స్ చెప్పాలనుకుంటున్నా. కేసులు తగ్గడానికి ఈ లాక్‌డౌన్ సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి. మీ ప్రేమకు కృతజ్ఞడ్ని." అని ఆ నోట్‌లో రాసుకొచ్చారు అల్లు అర్జున్. నేటి నుంచి పది రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన విషయం విదితమే.
కొద్ది రోజుల క్రితం తన ఆరోగ్యం గురించి ఆరాలు తీస్తూ, ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చిన అభిమానులకు తాను రికవర్ అవుతున్నాననీ, వర్రీ అవ్వాల్సిన పనిలేదనీ బన్నీ ధైర్యం చెప్పారు.తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన ఓ నోట్‌లో, "కొద్దిపాటి లక్షణాలతో నేను బాగానే ఉన్నాను. బాగానే రికవర్ అవుతున్నా, వర్రీ అవ్వాల్సిన పనిలేదు. ఇంకా నేను క్వారంటైన్‌లో ఉన్నాను. మీరు చూపిస్తున్న ప్రేమకు, నా వైపు మీరు పంపుతున్న ప్రార్థనలకు చాలా థాంక్స్. రుణపడిఉంటాను." అని రాసుకొచ్చారు.
ఈ నెల 28న తనకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు బన్నీ. అప్పుడు "హలో ఎవిరివన్! నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇంటిలో స్వీయ ఐసోలేషన్‌లోకి వెళ్లాను. అన్ని నియమ నిబంధనలను పాటిస్తున్నాను. నన్ను కాంటాక్ట్ అయినవాళ్లంతా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి. అవకాశం లభించిన వెంటనే వాక్సిన్ వేయించుకోండి. శ్రేయోభిలాషులను, అభిమానులను నా గురించి వర్రీ అవ్వద్దని కోరుతున్నాను. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ప్రేమతో.. అల్లు అర్జున్" అంటూ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసిన నోట్‌లో రాసుకొచ్చారు బన్నీ.
అప్పట్నుంచీ ఆయన ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఆరా తీస్తూ వస్తున్నారు. బన్నీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు షేర్ చేస్తున్నారు. దీంతో ఈరోజు తన ఆరోగ్యం గురించిన లేటెస్ట్ అప్‌డేట్‌ను ఆయన పంచుకున్నారు.