ప్రియా ఆనంద్‌ని చూసినవాళ్లు ఎవరైనా సరే, ఈ అమ్మాయి ఏజ్‌ని స్టాప్ చేసేసిందా? అని అనుకుంటారు. ఏళ్లు గడుస్తున్నా, ఏ మాత్రం తరగని అందం ప్రియా ఆనంద్ సొంతం. కెరీర్ బిగినింగ్‌లో తెలుగులో యంగ్ హీరోల పక్కన నటించింది ప్రియా ఆనంద్. ఈ మధ్య సుశాంత్ నటించిన నీళ్లట్యాంక్లోనూ మెయిన్ లీడ్ చేసింది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి 67వ సినిమాలో నాయికగా నటిస్తున్నారు ప్రియా ఆనంద్.
పదకొండేళ్ల క్రితమే విజయ్‌తో నటించడానికి ఓ ఛాన్స్ వచ్చిందట ప్రియా ఆనంద్కి. ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోయిందట. మళ్లీ ఇన్నాళ్లకు మరో అవకాశం వచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు ప్రియా ఆనంద్. ఈ సినిమా తనకు సూపర్‌డూపర్ కమ్‌బ్యాక్ అవుతుందని అంటున్నారు. ఇటీవల మన సినిమాల్లో లేడీ విలన్ల రోల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దళపతి 67 సినిమాలోనూ ప్రియా ఆనంద్ రోల్ నెగటివ్ షేడ్స్ లో ఉంటుందని సమాచారం. త్రిష సోదరిగా కనిపించబోతున్నారట ప్రియా ఆనంద్. విజయ్ సరసన త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. హిందీ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.
దళపతి 67 గురించి అప్డేట్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ రీసెంట్ టైమ్స్ లో ట్వీట్లతో దండయాత్ర చేసిన విజయ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఫుల్ మీల్స్ దొరికినట్టయింది. నచ్చిన బఫే కళ్లముందు ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, అలా ఫీలవుతున్నారు దళపతి ఫ్యాన్స్.లోకేష్ కనగరాజ్ ఇప్పటిదాకా ఓ యూనివర్శ్ లో సినిమాలను తీశారు. ఇప్పుడు విజయ్ 67 ని కంప్లీట్‌గా ఇంకో యూనివర్శ్ లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట. విజయ్ - లోకేష్ కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ సూపర్‌డూపర్ హిట్ అయింది.