![]() |
![]() |

కొరటాల శివ మొదట తెలుగు సినిమా రచయిత. మిర్చి చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు. తొలి చిత్రం మిర్చిలో ప్రభాస్ హీరోగా నటించారు. 2013లో వచ్చిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించింది. ఆ తరువాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ బాబు తో భరత్ అనే నేను ఇలా వరుస చిత్రాలను చేస్తూ వచ్చారు. కానీ ఆయనకు ఇటీవల చిరంజీవి- రామ్ చరణ్ లు నటించిన ఆచార్య డిజాస్టర్ తో పలు విమర్శలు ఎదురయ్యాయి. ముఖ్యంగా కొరటాల శివ పేరు చెప్తేనే మెగా ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. చిరు కూడా పైకి తాను కొరటాలను టార్గెట్ చేయడం లేదని చెబుతూనే మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి దర్శకులకు సలహాలు ఇస్తూ, కొరటాలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఇండైరెక్టుగా కొరటాల శివ ను ఉద్దేశించే అని అందరికీ బాగానే అర్థం అవుతున్నాయి. కానీ చిరు మాత్రం నేను కొరటాలను టార్గెట్ చేయడం లేదు అంటున్నారు.
ఆచార్య ముందు వరకు అపజయమే ఎరుగని మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనే బ్రాండ్ ను కొరటాల శివ సొంతం చేసుకున్నారు. ఆయన తీసిన సినిమాలు దర్శకునిగా కంటే మంచి కథకుడిగా నిలబెట్టాయి. ఆ కథా బలమే ఆయనను అపజయం ఎరుగని దర్శకుని చేసింది అనేది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఆచార్య విషయంలో ఏం జరిగిందో తెలియదు కథ విషయంలో కొరటాల మొదటిసారిగా ఫెయిల్ అయ్యారు. కథను కమర్షియల్ గా ప్రేక్షకుల్ని కన్విన్స్ చేసే విధంగా నడిపించడంలో తడబాటు కనిపించింది. అందుకే ఆచార్య చిత్రం కొరటాల కెరీర్ లో ఫస్ట్ డిజాస్టర్ మూవీ గా మారింది. ఇది ఒక పీడకల. తండ్రీకొడుకులు ఇద్దరు కలిసి బిగ్గెస్ట్ కొట్టాలని భావిస్తే మొదటికే మోసం వచ్చింది. దాంతో ఆచార్య ఫెయిల్యూర్ కి పూర్తి కారణం శివ అనే ఫీలింగ్ చిరంజీవిలో బలంగా ముద్ర పడిపోయింది. డైరెక్టర్ ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఇలా ఇద్దరు పెద్ద హీరోలను హ్యాండిల్ చేసేటప్పుడు పక్కా స్క్రిప్ట్ తో మూవీ స్టార్ట్ చేయాలి. ప్రతి సీన్ మీద ఒక విజన్ ఉండాలి. క్లారిటీ లేకపోతే సినిమాలు ఫ్లాప్ అవుతాయి.
నాలుగు గంటలు తీసి ఆ తర్వాత ట్రిమ్ చేయడం సరైన పద్ధతి కాదు. దాని వల్ల నిర్మాత డబ్బు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అని వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో కూడా చిరంజీవి పరోక్షంగా విమర్శలు చేశారు. దీనిపై మహేష్ అభిమానులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సీరియస్ గా రెస్పాండ్ అవుతున్నారు. చిరంజీవి ప్రతిసారి ఇలా విమర్శలు చేయడం మానుకోవాలని, దర్శకుడు అన్న తర్వాత ఒక్కసారి ఇలాంటి ఫ్లాప్ లు రావడం సహజమని అంటున్నారు. అంతమాత్రానికే ఈ స్థాయిలో పగబడతారా? అని మండిపడుతున్నారు. చిరు మాత్రం పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. చిరంజీవి మాటలను తప్పుగా రుజువు చేయాలంటే ఎన్టీఆర్ తో సినిమాను కొరటాల అద్భుతంగా తెరకెక్కించి తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకొని సాలిడ్ సక్సెస్ కొట్టాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా కొరటాల శివకు మాత్రం ఎన్టీఆర్ తో చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకం. ఆయన ప్రస్తుతం డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉన్నారు. దాంతో సాలిడ్ సక్సెస్ కొట్టి పాన్ ఇండియా లెవెల్ లో తొలిసారిగా తన సత్తా చాటాలని భావిస్తున్నారు. మరి చిరు విమర్శలకు శివ నోటి మాటలతో కాకుండా పనితీరుతో సమాధానం చెప్తాడా లేదా అనేది వేచి చూడాలి.
![]() |
![]() |