![]() |
![]() |

ఏ ముహూర్తాన మన సినిమాలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లోకి వెళ్లాయో మన సినిమా నిర్మాతలకు కొత్త లాభాలు, కొత్త కష్టాలు మొదలయ్యాయి. ప్రతి విషయానికి రెండు కోణాలు ఉన్నట్లే దీనికి కూడా బొమ్మబొరుసు రెండు ఉన్నాయి. అంతకుముందు నిర్మాతలు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీసేవారు. హీరోలు కూడా దానికి తగ్గ పారితోషకం తీసుకునేవారు. కానీ ఇప్పుడు నిర్మాతలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లో మోజులో పడి తమ చిత్రాలను ఆయా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. తద్వారా సినిమా హిట్ అయితే లాభాల పంట పండించుకోవచ్చని ఆశపడుతున్నారు. ఒక ప్రాంతం వారికి నచ్చకపోయినా మరో భాష వారికి ఆయా చిత్రాలు నచ్చే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో హీరోలు కూడా తమరేంజ్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లోకి వెళ్ళింది కాబట్టి తాము తీసుకునే రెమ్యూనరేషన్ విషయంలో కూడా కఠినంగా ఉంటున్నారు. తమ పారితోషికాలను భారీగా పెంచాలని పట్టుదల పడుతున్నారు.
పాన్ ఇండియా హీరోలుగా పేరు తెచ్చుకుంటున్న హీరోలందరు నేడు 100 కోట్ల పైగా పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమకున్న మార్కెట్, స్టార్డం, కష్టానికి ప్రతిఫలంగా 100 కోట్లనేది సామాన్యమైన విషయంగా వారు చెబుతున్నారు. దానికి నిర్మాతలు కూడా ఓకే చేస్తున్నారు. రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబులు తరువాతి సినిమాల కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభాస్ రెమ్యూనేషన్ అయితే ఏకంగా 150 కోట్లు దాటిపోయిందని సమాచారం. మహేష్ బాబు నిన్నటి వరకు 80 కోట్లు తీసుకుంటున్నారు. అయితే రాజమౌళితో చేయబోయే చిత్రంలో ఆయన కు 100 కోట్ల పారితోషికం లభిస్తున్నట్లు సమాచారం.
ఇంతకుముందే విజయ్, కమలహాసన్, రజినీకాంత్ 100 కోట్లు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి అజిత్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన దర్శకుడు, నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా కోసం అన్ని భాషల నుంచి నటీనటులను ఎంపిక చేస్తున్నారు. అజిత్‌కు జోడిగా నయనతార నటిస్తోంది. ప్రతినాయక పాత్రలో ఐశ్వర్యారాయ్ ఫైనల్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అజిత్ కి 100 కోట్ల రెమ్యూనేషన్ ఇస్తున్నారు. పీరియాడికల్ జోనర్‌లో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.
![]() |
![]() |