![]() |
![]() |

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకా చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదలైన సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం తన లాంగ్ రన్ ని పూర్తిచేసుకుంది. మొదట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం పక్కా మాస్ కమర్షియల్ సినిమాగా రొటీన్ మూవీగా విశ్లేషకులు తేర్చారు. కానీ వీరందరి విశ్లేషణలకు భిన్నంగా ఈ చిత్రం మాస్ జనాలను ఉర్రూత లూపుతూ అతి తక్కువ సమయంలోనే రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రవితేజ కెరీర్ లో 100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసిన చిత్రంగా ధమాకాన్ని చెప్పుకోవచ్చు.
ఇక ఈ చిత్రానికి దర్శకుడు త్రినాధరావు నక్కిన కాగా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ. వీరిద్దరి కలయికలో ఈ చిత్రం ఆద్యంతం రసవత్తరంగా మాస్ యాక్షన్ గా పొందింది. ఈ విధంగా గత ఏడాదిని రవితేజ విజయవంతంగా పూర్తి చేశారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య గా దుమ్మురేపారు. చిరుకి బూస్ట్‌గా సాగిన ఈ చిత్రంలో రవితేజ పాత్ర అత్యంత కీలకం.
తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం 200 కోట్లను దాటేసింది. అలా ఈ కొత్త ఏడాదికి కూడా రవితేజ 20 రోజుల వ్యవధిలోనే శుభారంభం ఇచ్చారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల క్లబ్బుల్లో చేరిన రవితేజ కెరీర్ లో ఈ రెండు చిత్రాలు మరపురాని మరువలేని చిత్రాలుగా మిగిలిపోతాయి. ఇక ధమాకా చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ హక్కులకు కొనుగోలు చేసింది. ఈనెల 22 నుండి స్ట్రీమింగ్ మొదలైంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడ ధమాకా సరికొత్త హంగులను చేకూర్చుకొని ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాలోని డిలీటెడ్ సీన్స్ ను కూడా ఓటీటీలో యాడ్ చేశారు. దీంతో నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాకు మంచి ఆదరణ సొంతం అవుతోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. కేవలం ఈ చిత్రం వారం రోజుల లోపల బ్రేక్ ఈవన్ సాధించింది. ఇక ఇందులో రవితేజకు జోడిగా బ్యూటీ శ్రీలీలా నటించింది. బీన్స్ సంగీతం ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల క్లబ్బులో రవితేజ రెండు చిత్రాలు కేవలం 20 రోజుల వ్యవధిలో చోటు సంపాదించుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.
![]() |
![]() |