![]() |
![]() |

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాలో ట్రెండు బాగా నడుస్తుంది. అన్ని భాషల్లోని స్టార్ హీరోలు దేశవ్యాప్తంగా తమ పాపులారిటీని క్రేజ్‌ను పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. సరైన కంటెంట్ కలిగిన చిత్రాలను నిర్మిస్తూ ఇండియన్ వైడ్‌గా తమ మార్కెట్లను పెంచుకుంటున్నారు. దర్శక నిర్మాతలు కూడా దీనికి తమ వంతు ప్రోత్సాహమందిస్తున్నారు. ఎందుకంటే ఆయా సినిమాలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదలయితే వారికి అది ఆర్థికంగానే కాక అవార్డుల పరంగా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బహుశా ఈ స్ట్రాటర్జీ బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి- ది కంక్లూజన్, కేజీఎఫ్ చాప్టర్1, కేజీఎఫ్ చాప్టర్2, పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్, సాహో, రాధేశ్యామ్, బ్రహ్మాస్త్ర చిత్రాల నుంచి మొదలైంది. ఇండియా లెవెల్ లో సినిమాలను రీచ్ చేయడం వల్ల ఒక భాషలో ప్రేక్షకులు రాకుండా మరో భాషలో ఆ సినిమా వారికి నచ్చితే సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తాయి.
ఈ మధ్యకాలంలో సినిమా నిర్మాణ వ్యయం కూడా 200 కోట్లు దాటింది. ఏకంగా హీరోలే 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. టైర్ 2 హీరోలు కూడా 50 నుంచి 80 కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారు. కాబట్టి ఆ స్థాయిలో కలెక్షన్లు రాబట్టాలంటే ఒక్క భాషకే పరిమితం అయిపోతే సరిపోదు. అందునా నిడివి ఎక్కువగా వస్తే వాటిని పార్ట్ వన్, పార్ట్ టూ లుగా విభజించి విడుదల చేయడం వల్ల ఆర్థికంగా నిర్మాతలకు బాగా కలిసి వస్తోంది. దాంతో హీరోలు అందరూ పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 11న మూడు పాన్ ఇండియా సినిమాలు విడుదల కాబోతున్నాయి. కోలీవుడ్ నుంచి రజిని కాంత్ నటిస్తున్న జైలర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. టాలీవుడ్ నుంచి త్రివిక్రమ్ -మహేష్ బాబుల కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 28 కూడా అదే రోజున విడుదల కానుంది.
బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ కాంబినేషన్లో వస్తున్న యానిమల్ సినిమా కూడా ఆగస్టు 11న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ మూడు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. మూడు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాలు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. కంటెంట్ బలం ఉంటే భాషకు సంబంధం లేకుండా సినిమా సక్సెస్ అవుతుందని కాంతారా మూవీ ప్రూవ్ చేసింది. ఆడియన్స్ టెస్ట్ మారడంతో ఈసారి సినిమాల సక్సెస్ ఎవరిని వరిస్తుందో అనేది అంచనా వేయలేని పరిస్థితిగా మారిపోయింది.
![]() |
![]() |