![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' సినిమాతో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు మారుమోగిపోతోంది. హాలీవుడ్ ప్రముఖులు సైతం రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఆస్కార్ బరిలో నిలిచినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రాజమౌళి హత్యకు కుట్ర జరుగుతుందంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇటీవల హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ 'ఆర్ఆర్ఆర్'ని ప్రశంసిస్తూ రాజమౌళితో మాట్లాడిన వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో క్లిప్ ని ట్విట్టర్ లో షేర్ చేసిన ఆర్జీవీ.. 'షోలే' దర్శకుడు రమేష్ సిప్పీ సహా ఇండియాలో ఉన్న అందరు దర్శకులను రాజమౌళి అధిగమించాడని అన్నారు. అంతేకాదు రాజమౌళి దయచేసి తన సెక్యూరిటీని పెంచుకోవాలని ఆర్జీవీ సూచించాడు. ఎందుకంటే ఇండియాలో ఉన్న ఫిల్మ్ మేకర్స్ అంతా రాజమౌళి పట్ల అసూయతో ఉండి, ఆయనను హత్య చేయడానికి ఒక గ్రూప్ లా ఏర్పడ్డారని, అందులో తాను కూడా భాగమేనంటూ వర్మ షాకింగ్ ట్వీట్ చేశాడు. తాగిన మైకంలో ఈ రహస్యాన్ని బయటపెడుతున్నాను అంటూ ఆర్జీవీ తన ట్వీట్ లో పేర్కొనడం కొసమెరుపు.
![]() |
![]() |