![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' మరో మైలురాయిని అందుకుంది. కేవలం పది రోజుల్లోనే ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి వసూళ్ల జోరు చూపిస్తూనే ఉంది. వింటేజ్ మెగాస్టార్ ని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు కదిలి వస్తుండటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. దీంతో కేవలం పదిరోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు.

మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సినిమాలో కేథరిన్ థ్రెసా, బాబీ సింహా, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
![]() |
![]() |