![]() |
![]() |

తెలుగులో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగుకు అంతర్జాతీయ పురస్కారమైనా గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఈ పాటకు స్వరకర్త గా వ్యవహరించిన ఎంఎం కీరవాణి ఈ ప్రతిష్టాత్మక అవార్డును చేజిక్కించుకున్నారు. ఇక ఈ నాటు నాటు విషయానికి వస్తే ఇందులో చాలామంది పాత్ర ఉంది. ముఖ్యంగా సాహిత్యం అందించిన చంద్రబోస్ పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవాల టాలెంట్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
కీరవాణి వేటూరి తరువాత ఎక్కువగా చంద్రబోస్ ను ప్రోత్సహించారు. కీరవాణి తాను స్వరపరిచిన ఎన్నో గీతాలను చంద్రబోస్ చేత రాయించారు. అలా వీరి కాంబో మొదటి నుంచి సూపర్ హిట్ కాంబినేషన్ గా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఆయనకు రాహుల్ స్లిప్లిగంజిలోని ప్రత్యేకత బాగా ఆకట్టుకుంది. కీరవాణి ట్రూప్ లో కోరస్ గా పాటలు పాడుతున్న రాహుల్ సిప్లిగంజ్ ను, ఆయనలోని ప్రతిభను కీరవాణి గుర్తించారు. దాని ఫలితమే ఈగ సినిమాలో టైటిల్ సాంగ్.
ఆ తరువాత దమ్ము సినిమాలో ఉత్తరం ఊపు మీద ఉంది అనే పాటతో ఆకట్టుకోగా కీరవాణి మాత్రం రాహుల్ కి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు ఇస్తున్నారు. తన గురువైన కీరవాణి వద్దనే కాకుండా ఇతర సంగీత దర్శకులతో కూడా ఆయన పనిచేశారు. ఇళయరాజా, మణిశర్మ, కోటి, దేవి శ్రీ ప్రసాద్, తమన్. సంతోష్ నారాయణ, అనిరుద్, విశాల్- శేఖర్, అనూప్ రూబెన్స్ వంటి ఎందరో సంగీత దర్శకుల చిత్రాలలో పాటలు పాడి మెప్పించారు. రాహుల్ సిప్లిగంజిది హైదరాబాదులోని పాతబస్తీ దూల్‌పేటకు చెందిన వాడు.
ఈయన తండ్రి దూల్పేటలో ఒక బ్యూటీషియన్. రాహుల్ ప్రతిభ, అబ్బాయిపై ఉన్న నమ్మకంతో సంగీతం నేర్పించారు. ఇక సినీ గాయకుడు కావాలనుకున్నా రాహుల్ శక్తి ధూల్ పేట నుంచి కృష్ణా నగర్‌కి తిరుగుతూ అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈయన మొదటిసారిగా సంగీత దర్శకుడు వెంగి తీసిన నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అనే చిత్రంలో పాటలు పాడాడు. వెంగి సంగీత దర్శకుని గా పనిచేస్తున్న సినిమాలలో పాటలు పాడారు. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ప్రవేట్ ఆల్బమ్స్ పై దృష్టి పెట్టారు. సంగీత దర్శకుడు కీరవాణి పరిచయం రాహుల్ కెరీర్ ని ఇంకో 100 మెట్లు పైకి ఎక్కించిందని చెప్పాలి.
రాహుల్ సిప్లిగంజ్ జైత్రయాత్ర గల్లీ నుండి ఢిల్లీ వరకు సాగింది. గల్లి నుండి గ్లోబల్ అవార్డును శాసించే అమెరికా సహా ఇతర దేశాలకు అతను పాడిన పాట చేరింది. నేడు ఆయన లోకల్ సింగల్ కాదు గ్లోబల్ సింగర్. ఇక ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా ఎంతో తోడ్పడింది. 800 చిత్రాలకు పైగా దాదాపు 3600 పాటలు రాసిన చంద్రబాబు ఈ పాట కోసం నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడట. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు లభించింది. కీరవాణి తనయుడైన కాలభైరవతో కలిసి ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. కాలభైరవ కూడా ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు. ఈ పాట ఇంత ఎనర్జిటిక్ గా వచ్చిందంటే దానికి కీరవాణి స్వరపరిచిన ట్యూన్ అందుకు తగిన సాహిత్యం గాయకుల ప్రతిభ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు దానికి తగ్గట్టుగా వేసిన స్టెప్పులు అన్ని అందంగా కుదిరాయి. ఇక ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ కూడా ఈ గౌరవానికి ఒక మూలస్థంభం. ఇలా వీరందరి కృషి ఫలితంగానే నేడు కీరవాణి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని నాటు నాటు పాట ద్వారా గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్నారు.
అంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్న మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఇది మన తెలుగు చిత్రం కావడం దీనిలో నుంచి ఒక తెలుగు పాటకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం అభినందనీయం. మొత్తానికి ఈ పాట అంతర్జాతీయ యవనికపై గొప్ప వెలుగులు విరజిమ్మింది. ఇలా తీసుకుంటే కీరవాణి తరువాత ఈ పాటకు పని చేసిన చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షితుల సమిష్టి కృషి ఫలితమే ఈ నాటు నాటు పాటకు లభించిన అరుదైన గౌరవం.
![]() |
![]() |