![]() |
![]() |

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు సుధీర్ వర్మ కన్నుమూశాడు. వైజాగ్ లోని తన నివాసంలో ఈ తెల్లవారుజామున ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అంత్యక్రియలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే సుధీర్ సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన అనారోగ్యంతో కన్నుమూశాడని అంటున్నారు.
'కుందనపు బొమ్మ', 'సెకండ్ హ్యాండ్', 'షూటౌట్ ఎట్ ఆలేరు' వంటి సినిమాల్లో నటించిన సుధీర్ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది. సుధాకర్ కోమకుల, చాందిని చౌదరి జంటగా నటించిన 'కుందనపు బొమ్మ'లో సుధీర్ కీలక పాత్ర పోషించాడు. ఆయన మృతి పట్ల సుధాకర్ స్పందించాడు. నువ్వు లేవన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
![]() |
![]() |