![]() |
![]() |

ఒకప్పుడు ఒక సినిమా పాటలు హిట్ అయితే ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్ జరిగేవి. కానీ నేడు మాత్రం యూట్యూబ్ లలో ఆయా పాటలకు వచ్చిన అత్యధిక వ్యూస్ ని బట్టి సక్సెస్‌ను నిర్ణయిస్తున్నారు. యూట్యూబ్ వ్యూస్ ని బట్టి ఆడియో సక్సెస్‌ను సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఇక్కడ స్టార్ హీరోల చిత్రాలు అంటే సంగీత దర్శకులుగా దేవిశ్రీప్రసాద్, తమన్ ల పేర్లే వినిపిస్తాయి. కీరవాణికి ఎంతో డిమాండ్ ఉన్నప్పటికీ ఆయన తాను చేసేచిత్రాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నారు. అద్భుతమైన కంటెంట్ కలిగి, తాను చేయదగ్గ చిత్రం అనిపిస్తే గానీ ఆయన చిత్రాలు ఒప్పుకోవడం లేదు. కాగా ఆ మద్య కాస్త దేవిశ్రీప్రసాద్ రేసులో వెనుకబడ్డారు. ఆయన సంగీతం అందించిన సరిలేరు నీకెవ్వరు, తమన్ సంగీతం అందించిన అల వైకుంఠపురంలో చిత్రాలు 2020లో విడుదలయ్యాయి. వీటిలో తమన్ సంగీతం అందించిన అల వైకుంఠపురంలో సంగీతం పరంగా సంచలనం సృష్టించింది.
ఇక తాజాగా ఈ ఏడాది కూడా తమన్ సంగీతం అందించిన బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యలు విడుదలయ్యాయి. ఇందులో దేవిశ్రీ సంగీతం అందించిన వాల్తేరు వీరయ్య విజయం సాధించింది. తమన్ సంగీతం అందించిన వీరసింహారెడ్డి చిత్రం బీజీఎం విషయంలో అదరగొట్టినప్పటికీ పాటల పరంగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిని అదిగమించింది. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ ఆడియో ఆల్బమ్స్ యూట్యూబ్‌లో సత్తా చాటుతున్నాయి. పుష్ప ది రైజ్ చిత్రానికి ఆయన అందించిన సంగీతానికి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభించింది. దాంతో మొదటి 100 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న తెలుగు ఆల్బమ్‌గా పుష్ప1 రికార్డు సృష్టించింది. దాంతో దేవిశ్రీ క్రేజ్ మళ్లీ విపరీతంగా పెరిగింది. పుష్ప తర్వాత కాస్త గ్యాప్ లో ఆయన వాల్తేరు వీరయ్యతో వచ్చారు. మాస్ బీట్స్ తో కుమ్మేశారు. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా ప్రతి సాంగ్ ను కూడా ఊరమాస్ ట్యూన్స్ కంపోజ్ చేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ బాస్ పార్టీ అంటున్నారు.
మొత్తానికి అతి తక్కువ సమయంలోనే వాల్తేరు వీరయ్య ఆల్బమ్ యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. వాల్తేరు వీరయ్య లోని బాస్ పార్టీ పాట ఏకంగా 50 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోగా పూనకాలు లోడింగ్ 20 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోంది. ఇతర పాటలు కూడా మినిమం పది మిలియన్ వ్యూస్ ని రాబట్టాయి. దాంతో వాల్తేరు వీరయ్యతో మరోమారు దేవిశ్రీప్రసాద్ కొత్తగా 100 మిలియన్ల క్లబ్ లో చేరారు. దీంతో మరోసారి దేవిశ్రీప్రసాద్ టాలీవుడ్ లో తన సత్తా చాటినట్లు అయింది. ఈ విషయంలో ఆయన తన పోటీ సంగీత దర్శకుడు తమన్ ని అధిగమించాడనే చెప్పాలి.
![]() |
![]() |