![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి వారంలోనే రూ.90 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటిన ఈ చిత్రం రెండో వారంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఇక పదో రోజు కలెక్షన్లు పరంగా తెలుగునాట ఈ చిత్రం 'బాహుబలి-1'ని దాటేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో పదోరోజు వసూళ్ళ పరంగా మొదటి మూడు స్థానాల్లో రూ.16.10 కోట్ల షేర్ తో 'ఆర్ఆర్ఆర్', రూ.8.55 కోట్ల షేర్ తో 'బాహుబలి-2', రూ.5.45 కోట్ల షేర్ తో 'బాహుబలి' ఉండగా.. తాజాగా 'వాల్తేరు వీరయ్య' రూ.6.66 కోట్ల షేర్ తో 'బాహుబలి'ని దాటేసి మూడో స్థానంలోకి వచ్చింది.
సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన 'వాల్తేరు వీరయ్య' మొదటిరోజు నుంచి వసూళ్ళలో దూకుడు చూపిస్తూనే ఉంది. 11 రోజుల్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.95.03 కోట్ల షేర్ రాబట్టిందని అంచనా. ఇప్పటిదాకా నైజాంలో రూ.31.45 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.16.08 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.47.50 కోట్ల షేర్ వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియా రూ.7.35 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.11.75 కోట్ల షేర్ కలిపి 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 114.13 కోట్ల షేర్ సాధించింది. ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య' జోరు చూస్తుంటే ఫుల్ రన్ లో మరో రూ.10-15 కోట్ల షేర్ రాబట్టే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |