![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి నుంచి ఫోన్ వచ్చినా, మెసేజ్ వచ్చినా ఎగిరి గంతేస్తారు. ఆయన నుంచి ఫోన్ లేదా మెసేజ్ రావడాన్ని అదృష్టంగా ఫీలయ్యేవారు ఎందరో ఉంటారు. కానీ యాంకర్ సుమ మాత్రం మెగాస్టార్ నుంచి మెసేజ్ వస్తే పట్టించుకోలేదట. మూడేళ్ళ పాటు వరుసగా మెసేజ్ లు వస్తే కనీసం రిప్లై కూడా ఇవ్వలేదట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి రివీల్ చేశారు.
చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుమ హోస్ట్ చేస్తున్న 'సుమ అడ్డా' అనే టీవీ షోలో చిరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. చిరంజీవి మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వని ఒకే ఒక్క పర్సన్ సుమ అన్నారు. సుమ పుట్టినరోజు అని తెలిసి విషెస్ చెబుతూ మెసేజ్ చేశానని, కానీ ఆమె నుంచి ఎలాంటి రిప్లై రాలేదని తెలిపారు. అలా మూడేళ్ళ పాటు వరుసగా విషెస్ చెబుతూ మెసేజ్ పెట్టినా.. ఒక్కసారి కూడా సుమ నుంచి రిప్లై రాలేదని చిరంజీవి చెప్పుకొచ్చారు.
అయితే చిరు మెసేజ్ లకు రిప్లై ఇవ్వకపోవడానికి గల కారణాన్ని సుమ వివరించారు. అప్పుడు చిరంజీవి గారి నెంబర్ తన దగ్గర లేదని, ఎవరో ఆయన పేరుతో మెసేజ్ చేశారు అనుకోని పట్టించుకోలేదని తెలిపారు. అయినా చిరంజీవి తన బర్త్ డేకి విష్ చేస్తారని ఎలా ఊహించగలనని చెప్పారు. ఆ తర్వాత అది నిజంగానే చిరంజీవి గారి నెంబర్ అని తెలిసి షాక్ అయ్యానని, వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పి నెంబర్ సేవ్ చేసుకున్నానని సుమ తెలిపారు.
![]() |
![]() |