![]() |
![]() |

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస చిత్రాలు చేస్తున్న ముద్దుగుమ్మ రష్మిక మందన. కన్నడకు చెందిన ఈ నటి కన్నడలోనే కాకుండా దక్షిణాదిలో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది. ఈ మధ్య కాస్త స్లో అయింది. తాజాగా కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటించిన వారిసూ చిత్రంలో నటించింది. ఈ చిత్రం తెలుగులోకి వారసుడుగా డబ్ అయింది. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి తర్వాత చేస్తున్న యానిమల్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్పా ది రూల్ లో నటిస్తోంది. ఈమె తెలుగులో మరో చిత్రాన్ని కన్ఫర్మ్ చేసింది. నితిన్ తో ఈమె మరో చిత్రం చేయనుంది. గతంలో వీరి కాంబినేషన్‌లో భీష్మ చిత్రం వచ్చింది. ఈ సినిమా మంచి హిట్ అయింది.
నితిన్ వక్కంతా వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి కాకుండానే వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో నితిన్ రష్మిక మండన మరోసారి భీష్మ చిత్రం తర్వాత వెంకీ కుడుములతో కలిసి పని చేయబోతున్నారు. ఇక ఈమె విజయ్ దేవరకొండ సరసన కూడా ఓ చిత్రం చేసేందుకు ఒప్పుకుందని సమాచారం. బాలీవుడ్ లో కూడా రెండు మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు ఈమె బాలీవుడ్లో అవకాశాలు వస్తున్నప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం, ఇక్కడ ప్రేక్షకులకు దూరం కాకుండా చూసుకోవడం మంచి పరిణామం అని చెప్పాలి.
![]() |
![]() |