![]() |
![]() |

టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ఎదగడంపై విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఒక నాలుగు ఐదు చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్నాయి. వీటిలో పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగే చిత్రాలు కూడా ఉండి ఉండవచ్చు. ఈ ఐదారు చిత్రాలలో మూడు చిత్రాలు ఏకంగా పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆది పురుష్. ఇందులో ప్రభాస్ రాముడిలా కనిపిస్తుండగా కృతి సనన్ సీత పాత్రలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య విడుదల చేసిన చిన్నపాటి టీచర్ ప్రేక్షకులకు నచ్చలేదు. వి ఎఫ్ ఎక్స్ పనులు చాలా నాసిరకంగా ఉన్నాయి అని విమర్శలు వెల్లు వెత్తాయి. దాంతో ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ కు వాయిదా వేశారు.
మరోవైపు ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్‌గా కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ రూపొందుతోంది. ఇక మహానటి చిత్రం తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్‌కి జోడిగా దీపికా పడుకొనే నటిస్తుండగా అమితాబచ్చన్, దిశా పటాని వంటి వారు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా యోధురాలు గెటప్ లో ఉన్నా దీపికా పడుకొనే లుక్కును విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోంది.
ఇక ఈ మూడు చిత్రాలు తరువాత చెప్పుకోదగిప చిత్రం అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప2 అంటే పుష్పాది రూల్ ఈ మూవీ కూడా ఈ ఏడాది చివర్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పోనియన్ సెల్2, రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్నాయి. మరి వీటిలో ఏవి బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చాటుకుని పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంటాయో వేచి చూడాలి.
![]() |
![]() |