![]() |
![]() |

కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి దర్శకులను ఉద్దేశించి ఏదైనా కామెంట్ చేస్తే అది కొరటాల శివనే అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా చిరు 'వాల్తేరు వీరయ్య' చిత్రం విజయోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. దర్శకులు షూటింగ్ ప్రారంభం నుంచే స్క్రిప్ట్ దశలోనే సినిమాకి ఏమేం కావాలో వాటన్నిటినీ పేపర్ పై పెట్టాలని, పేపర్ వర్క్ పై విషయముంటే అది క్లారిటీగా ఉంటుందని చెప్పుకొచ్చారు. పైగా నాలుగు గంటల సినిమా తీసి మూడు గంటలకు ట్రిమ్ చేయడం మంచి పద్ధతి కాదు. దానివల్ల నిర్మాతల ఖర్చు వృధా అవుతుంది. వారి డబ్బులు బుట్ట దాఖలవుతాయి అని వ్యాఖ్యానించారు. అలాగే ఆయన వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబిపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా సక్సెస్ పక్కన పెడితే తాను అనుకున్న సమయంలో తాను అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేసిన బాబి మొదటి విజయం సాధించాడని చిరు వ్యాఖ్యానించారు. తన తండ్రి చనిపోయిన మూడవ రోజే బాబీ షూటింగ్ కి వచ్చాడు అని చెప్పారు.
ఆచార్య రిలీజ్ తర్వాత పలు సినిమా ఈవెంట్లలో చిరు మాట్లాడుతూ దర్శకులు సెట్ లో డైలాగ్స్, సీన్స్ రాస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదు అన్నారు. దాంతో ఇవన్నీ కొరటాల శివను ఉద్దేశించి చిరు అన్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. ఆచార్య సినిమా డిజాస్టర్ కావడానికి కొరటాల శివ ప్రధాన కారణమని, సినిమా కథ కథనాలపై దృష్టి పెట్టకుండా నిర్మాణం, బిజినెస్ పై దృష్టి పెట్టడం వల్లే డిజాస్టర్ గా నిలిచిందని ప్రచారం చేశారు. కానీ తాను మాత్రం కొరటాలను ఉద్దేశించి ఏ కామెంట్ చేయలేదని వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకలో చిరు క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీ బాగుండాలంటే ప్రతి దర్శకుడు సెట్స్ కి వెళ్లేముందే ప్రతి అంశాన్ని పేపర్ పై వర్కౌట్ చేయాలని చెప్పారు. నాలుగు గంటల షూటింగ్ సినిమా చేసి ఒక గంట ట్రిమ్ చేయడం కంటే పర్ఫెక్ట్ గా మూడు గంటల్లోపే షూటింగ్ చేసే విధంగా పక్కా స్క్రీన్ ప్లేతో రూపొందించడం ఉత్తమం. దీని వలన చాలా ఖర్చు ఆదా అవుతుంది. ఇది సాధారణంగా చెప్పిన మాటలే గాని ప్రత్యేకంగా ఒక దర్శకుడిని ఉద్దేశించి అన్నవి కావు అంటూ.. తాను కొరటాలను టార్గెట్ చేయలేదని చిరు క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
![]() |
![]() |