![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన 'వీరసింహారెడ్డి' చిత్రం తాజాగా విడుదలై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ ను టార్గెట్ చేసుకున్న విధంగా ఈ చిత్రం ఉందని ప్రచారం సాగుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించకపోయినప్పటికీ మాస్ ఆడియన్స్ ఈ చిత్రానికి మూల స్తంభాలుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య చెప్పిన డైలాగులు, అందులో వాడిన పదాలు, వాటి ప్రాసలు, ఆయన డైలాగ్ చెప్పిన విధానం చూసి ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. "జై బాలయ్య జై బాలయ్య" అంటున్నారు.
ఇంకా ఈ చిత్రంలో బాలయ్య బాబుకు జోడిగా శ్రుతి హాసన్ నటించినా కానీ, ఆమె కంటే హనీ రోజ్ నటించిన పాత్రకి ప్రాధాన్యం ఎక్కువ అని చెప్పాలి. ఈమె తెలుగులో హీరోయిన్‌గా 'ఆలయం' అనే సినిమా చేసింది. ఇందులో శివాజీ హీరో. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఈమె నటనకు, అందానికి మలయాళ చిత్ర ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. తద్వారా మల్లు వుడ్ లో ఈమె బాగా బిజీ అయింది. తెలుగులో ఆ తర్వాత 'ఈ వర్షం సాక్షిగా' అనే చిత్రంలో నటించింది. ఇంత కాలానికి ఈమె బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి'లో బాలయ్యకు తల్లిగా, భార్యగా కనిపించి ఈ రెండు విధాలుగాను హనీ మెప్పించింది.
దాంతో 'వీరసింహారెడ్డి' తరువాత ఈమె తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం జయాపజయాలకు అతీతంగా హనీ రోజ్‌కు మాత్రం మంచి గుర్తింపు దక్కడం గమనార్హం. సో.. నటిగా తన నటనతో పాటు అందంతో కూడా ఆకకట్టుకుని ఈమె 'వీర సింహారెడ్డి'కి ఓ నిండుతనాన్ని తెచ్చిన అని హనీరోజ్ గురించి ప్రస్తుతం తెలుగు మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి.
![]() |
![]() |