![]() |
![]() |

ఇటీవల రవితేజ నటించిన 'ధమాకా' చిత్రం మాస్ మసాలా ఎంటర్టైనర్ గా యావరేజ్ టాక్ ను సంపాదించింది. కానీ లాంగ్ రన్ లో ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి 100 కోట్లు వసూలు చేసిన క్లబ్బులో చోటు సాధించింది. అలాగే బాలయ్య నటించిన 'వీరసింహారెడ్డి' చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రానికి ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై, జగన్ ను టార్గెట్ చేసి బాలయ్య తూటాల లాంటి డైలాగులతో థియేటర్లను మారుమోగిస్తున్నాడు.
ఈ చిత్రంలో ఎలివేషన్స్ మీద పెట్టిన దృష్టి ఎమోషన్స్పై పెట్టలేదని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. తనకు వచ్చిన మంచి అవకాశాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని సద్వినియోగం చేసుకోలేకపోయాడని విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు సందర్భం లేకుండా ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా ఈ చిత్రం ఉందని అంటున్నారు. కథలో భాగంగా వైసీపీని జగన్ టార్గెట్ చేస్తే బాగుండేదని, కానీ సందర్భం లేకుండా ఇలా టార్గెట్ చేస్తే అది సినిమాకు మైనస్ గా మారుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అయితే బాలయ్య అభిమానులు మాత్రం బాలయ్యను చూపించిన విధానం చూసి గోపీచంద్ మలినేనిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇక ఏపీలో వైసీపీ వ్యతిరేక పవనాలు ఇస్తుండడంతో సాధారణ జనానీకం కూడా ఈ చిత్రంలోని బాలయ్య డైలాగులపై అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రెడిట్ మాటల రచయిత అయిన సాయిమాధవ్ బుర్రాకి దక్కుతుందని చెప్పాలి. సాయి మాధవ్ బుర్ర చేత అలాంటి డైలాగులు రాయించిన గోపీచంద్ మలినేని అదే రేంజిలో ఆ డైలాగులకు జీవం పోసిన బాలయ్యలను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు అధికార వైసీపీ పార్టీపై చేసిన విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఏపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చేస్తున్న అరాచకాలపై బాలయ్య జూలు విదిలించిన సింహంలా రెచ్చిపోయి నటించారు.
ముఖ్యంగా అభివృద్ధి అంటే ఏమిటో ఈ చిత్రంలో హోమ్ మినిస్టర్ కి బాలయ్య బాబు చెప్పే నిర్వచనం ఆ సన్నివేశాలలో బాలయ్య ఉపయోగించిన పదాలు, రైమింగ్ థియేటర్స్ లో ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించేలా చేస్తోంది. ఇక నేమ్ బోర్డు విషయంలో ఆయన పేల్చిన డైలాగులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినవి అని అందరికీ అర్థమవుతుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా వైసీపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు బాలయ్యపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
బాలయ్యని జగన్ ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటాడని కానీ బాలయ్య మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఏమీ బాగాలేదని 'వీరసింహారెడ్డి'ని బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా నినాదాలు చేస్తున్నారు. అయినా గుమ్మడికాయ దొంగ ఎవడు అంటే భుజాలు తడుముకున్నట్లుగా బాలయ్య అభివృద్ధి అంటే ఏమిటో చెబితే జగన్ అండ్ కోకు ఉలిక్కిపాటు ఎందుకో తెలియడం లేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ వార్ ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి...!
![]() |
![]() |