![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటిదాకా బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రూ.75 కోట్ల షేర్ తో 'అఖండ' నిలవగా.. ఇప్పుడు ఆ రికార్డుని 'వీరసింహారెడ్డి' బ్రేక్ చేసేలా ఉంది. నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.52 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా పయనిస్తోంది.
భారీ అంచనాలతో జనవరి 12న విడుదలైన 'వీరసింహారెడ్డి' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.31.05 కోట్ల షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాల్లో ఇదే హైయెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. ఇక రెండో రోజు రూ.6.15 కోట్ల షేర్, మూడో రోజు రూ.7.30 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.8.15 కోట్ల షేర్ తో సత్తా చాటిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.52.65 కోట్ల షేర్ సాధించింది.
తెలుగు రాష్ట్రాల పరంగా చూస్తే మొదటి రోజు రూ.25.35 కోట్ల షేర్, రెండో రోజు రూ.5.25 కోట్ల షేర్, మూడో రోజు రూ.6.45 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.7.25 కోట్ల షేర్ రాబట్టిన వీరసింహారెడ్డి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి నాలుగు రోజుల్లో 44.30 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.12.10 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.11.96 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.20.24 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
'వీరసింహారెడ్డి' ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ వేల్యూ రూ.73 కోట్లని అంచనా. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 70 శాతానికి పైగా రికవరీ సాధించింది. ఇంకా 21 కోట్ల షేర్ రాబడితే ఈ మూవీ హిట్ స్టేటస్ దక్కించుకుంటుంది. 'వీరసింహారెడ్డి' దూకుడు చూస్తుంటే.. ఈ వారంలోనే ఆ మొత్తం రాబట్టి బాలయ్య కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచే అవకాశముంది.
![]() |
![]() |