కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్లో త్రివిక్రమ్ సినిమా 'అ ఆ' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. 'ప్రేమమ్' మూవీలో నాగచైతన్య పక్కన కనిపించే ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా కనిపించి అలరించింది. గమనించదగ్గ విషయమేమంటే ఆ మూవీ మలయాళ ఒరిజినల్ 'ప్రేమమ్'లో చేసిన క్యారెక్టర్‌నే తెలుగులోనూ చేసింది. మలయాళ 'ప్రేమమ్'తోటే ఆమె తెరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఆమె నటించడం వెనుక ఒక స్టోరీ ఉంది.
అనుపమ ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు మలయాళ హీరో, ప్రొడ్యూసర్ నివిన్ పాల్.. 'ప్రేమమ్' మూవీకి ఒక హీరోయిన్ కావాలని ఫేస్బుక్లో కాస్టింగ్ కాల్ స్టేటస్ పెట్టాడు. అనుపమ ఫ్రెండ్ అర్చన దాన్ని చూసి, అనుపమను అడగకుండానే ఆమె ఫొటోల్ని ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్‌కి పంపించింది. పది రోజుల తర్వాత ఆడిషన్‌కు రావాల్సిందిగా అనుపమకు పిలుపొచ్చింది. అంతదాకా అర్చన తన ఫొటోలు పంపిన విషయం ఆమెకు తెలీదు. అదే విషయం తన అమ్మానాన్నలకు చెప్పి "నన్నేం చెయ్యమంటారు?" అనడిగింది అనుపమ.
సినిమాల్లో అవకాశం అనగానే కాస్త భయమేసి కోపంతో పేరెంట్స్ ఆమెను బాగా తిట్టారు. కానీ రెండు రోజుల తర్వాత ఆడిషన్‌కు అంగీకరించి దగ్గరుండి తీసుకెళ్లారు. "అదే నా ఫస్ట్ ఆడిషన్. హీరోయిన్గా సెలక్టయ్యా. ప్రేమమ్ సినిమా అవకాశం వచ్చింది. అంతకుముందు కెమెరా ముందు వర్క్ చేసిన అనుభవం లేదు. అయినప్పటికీ కెమెరా ఫియర్ లేకుండా యాక్ట్ చేశా" అని చెప్పింది అనుపమ.