'సినిమా చూపిస్త మావ' మూవీకి రాసిన హిలేరియస్ డైలాగ్స్‌తో రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకొని, రవితేజ లాంటి స్టార్ హీరో ప్రశంసలు అందుకున్న ప్రసన్నకుమార్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం రాత్రి 8:45 గంటకు మచిలీపట్నంలోని రెవన్యూ కల్యాణ మండపంలో సందడిగా జరిన వివాహ వేడుకలో మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు ప్రసన్న. ఈ వేడకకు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, హీరో అశ్విన్, జబర్దస్త్ రామ్‌ప్రసాద్, హైపర్ ఆది, అవినాష్, ప్రసన్న సన్నిహితు స్నేహితులు, వధూవరుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్', 'హలో గురు ప్రేమకోసమే' వంటి సినిమాల ద్వారా రచయితగా టాలీవుడ్లో తనదైన ముద్ర వేశాడు ప్రసన్నకుమార్. ముఖ్యంగా పంచ్ డైలాగ్స్, కామెడీ డైలాగ్స్‌ను అతను రాసే విధానం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. త్వరలో అతను రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాకు కథ, మాటలు అందించనున్నాడు. అలాగే వాలీబాల్ ప్లేయర్ ఆరికపూడి రమణారావు జీవిత చరిత్ర ఆధారంగా మరో కథను సిద్ధం చేస్తున్నాడు.