ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు కుమార్తె హన్షితా రెడ్డి మంగళవారం కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. అర్చిత్ రెడ్డితో కొన్నాళ్ళ క్రితం ఆమెకు పెళ్ళయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులు హైదరాబాద్లో కొత్త ఇల్లు కట్టుకున్నారు. బుధవారం మంచి ముహూర్తాన ఆ ఇంటిలో అడుగుపెట్టారు. కరోనా నేపథ్యంలో గృహ ప్రవేశానికి ఎక్కువ సంఖ్యలో అతిథులను ఆహ్వానించలేదని సమాచారం. కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్యే శుభకార్యం కానిచ్చారు.
అర్చిత్, హన్షితా దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి. ఒక అమ్మాయి. గృహ ప్రవేశం సందర్భంగా నవ్వుతూ నలుగురూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ కొత్త ఇంటికి పూర్తిగా షిఫ్ట్ కావడానికి మరికొన్ని రోజులు పడుతుందట. ఇంకా ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ కంప్లీట్ కాలేదని టాక్.