యాక్టర్ కమ్ యాంకర్, ‘బిగ్ బాస్’ ఫేమ్ భానుశ్రీ గుర్తుందా? ‘కుమారి 21 ఎఫ్’లో హెబ్బా పటేల్‌తో బ్రేకప్ తరవాత రాజ్‌తరుణ్ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు కదా! ఆమె భానుశ్రీ. ‘ఏడు చేపల కథ’ వంటి హాట్ సినిమాలోనూ నటించింది. అబ్బాయి గొంతులా ఉందని ఆమెపై చాలా సెటైర్లు పడతాయి. అయినా... అవకాశాలకు కొదవ లేదు.
ప్రజెంట్ ‘జీ తెలుగు’ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న ‘అదిరింది’ కామెడీ షోకి భానుశ్రీ యాంకరింగ్ చేస్తోంది. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని భానుశ్రీ చెప్పింది. ఆల్రెడీ ఆమెకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతడిని పెళ్లి చేసుకోనుంది.
‘బిగ్ బాస్’ షోలో ఉన్నప్పుడు శివశంకర్‌రెడ్డి అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు భానుశ్రీ వెల్లడించింది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కుటుంబం కూడా తనకు మద్దతుగా నిలవలేదనీ, అప్పుడు శివశంకర్‌రెడ్డి ఎంతో మద్దతుగా నిలిచాడనీ భానుశ్రీ చెప్పుకొచ్చింది. వీళ్ళిద్దరూ సింపుల్‌గా ఒక టెంపుల్‌గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారట. అదీ సంగతి!