![]() |
![]() |

అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదాను సాధించుకున్న హీరోయిన్లలో రష్మిక మందన పేరు ముందుగా చెప్పుకోవాలి. కన్నడ సినిమాలలో కిర్రాక్ పార్టీ అనే చిత్రంతో పరిచయమైన ఈమె ఆ తర్వాత కన్నడలో చిన్న సినిమాలు చేసింది. ఈమె తెలుగులో వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వచ్చిన చలో చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత గీతగోవిందం తో బ్లాక్ బస్టర్ హిట్ నందించుకుంది. దేవదాసు చిత్రం పరవాలేదు అనిపించింది. డియర్ కామ్రేడ్ చిత్రం సరిగా ఆడలేదు. ఇంకా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటించింది. నితిన్ తో భీష్మ... ప్రస్తుతం బన్నీతో పుష్ప1 లో నటించింది. పుష్పా చిత్రంతో శ్రీవల్లిగా మారిన ఈమెను అభిమానించే ప్రేక్షకుల సంఖ్య దక్షిణాదిలో బాగానే పెరుగుతుంది. తాజాగా ఈమె కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన వారిసు చిత్రంలో నటించింది. ఈ చిత్రం తెలుగులో వారసుడిగా డబ్ అయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం శ్రీవల్లి బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లో ఈమె ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అలియాస్ అర్జున్ రెడ్డి ఫేమ్ తెరకెక్కిస్తున్న యానిమల్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్ హీరో పాత్రను పోషిస్తున్నాడు. దీంతోపాటు మిషన్ మజ్ను అనే సినిమాను కూడా ఈమె ఒప్పుకుంది గుడ్ బై చిత్రానికి ఓకే చెప్పింది. సంజయ్‌లీలా భన్సాలీ చిత్రంలో కూడా నటించే అవకాశం వచ్చిందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈమె బాలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్ గా మారిన ఆశ్చర్యం లేదు. దక్షిణాదిన బాగా పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల దక్షిణాది చిత్రాలలోని పాటలపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం పుష్ప2గా రూపొందుతున్న పుష్పా ది రూల్ చిత్రంలో నటిస్తోంది. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. అలాంటి ఈమె సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా తన చేతిపై ఉండే టాటూ గురించి తెలిపింది. ఇందులో ఆమె తన చేతి పై ఇర్రిప్లేసబుల్ అనే టాటూ కనిపిస్తుంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ నాకు మొదట టాటూ వేయించుకోవాలని ఉండేది కాదు. కానీ కాలేజీలో ఒక అబ్బాయి అమ్మాయిలు గురించి మాట్లాడుతూ... ఆడపిల్లలు బాధను ఓర్చుకోలేరు. వాళ్లకు సూదులు అన్న భయమే అన్నాడు. అది తప్పు అని నిరూపించాలని నేను టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఏం వేయించుకోవాలో తెలియలేదు. చాలా సేపు ఆలోచించాక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరు మరొకరిని భర్తీ చేయలేరని నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. ఇదే అర్థం వచ్చేలా ఇర్రిప్లేసబుల్ అనే పదాన్ని వేయించుకున్నాను అని చెప్పుకొచ్చింది.
![]() |
![]() |