![]() |
![]() |

తెలుగు వారికి తమిళ సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోనీతో మంచి అనుబంధమే ఉంది. నాన్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సలీం మరీ ముఖ్యంగా బిచ్చగాడు చిత్రాలతో తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించారు. బిచ్చగాడు చూసిన చాలా మంది సినిమా అంటే ఇలా ఉండాలి తల్లి కొడుకుల ప్రేమను, అనుబంధాన్ని ఎంతో గొప్పగా చూపించారు. ఆ అనుబంధాన్ని చూపించడం మనసులను హత్తుకునేలా ఉంది.
బాహుబలి లాంటి చిత్రాలు తీసే కంటే చిన్న చిత్రాలైనా సరే బిచ్చగాడు లాంటి చిత్రాలు వస్తే బాగుంటుంది అని స్వర్గీయ కైకాల సత్యనారాయణ నుంచి ఎందరో తమ ఇంటర్వ్యూలలో తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇక ఆయన నటించిన తెలుగు చిత్రాల విషయానికి వస్తే తమిళంలోరూపొంది డబ్బింగ్ అయినా విజయ రాఘవన్, జ్వాలా, కిల్లర్, బిచ్చగాడు, ఇంద్రసేన, బేతాళుడు, డాక్టర్ సలీం, నకిలీ వంటి చిత్రాలు ఉన్నాయి, కాగా ప్రస్తుతం బిచ్చగాడు తర్వాత ఆయనకు పెద్దగా హిట్స్ లేవు. ఇదే సమయంలో ఆయన తన చిత్రాలన్నింటినీ తెలుగులో డబ్బింగ్ చేస్తున్న కూడా సరైన సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆయన బిచ్చగాడు 2 సినిమాకి హీరోగా, దర్శకునిగా, సంగీత దర్శకునిగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల మలేషియాలో షూటింగ్ చేసేందుకు వెళ్లారు. అక్కడ షూటింగ్ చేసే సమయంలో ఆయన నడుపుతున్న పడవ అదుపుతప్పి కెమెరా సహా ఇతర యూనిట్ సభ్యులు ఉన్న మరో పడవను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నాను. ప్రమాదం జరిగి రెండు మూడు రోజులు గడుస్తున్నా ఇంకా ఆపస్మారక స్థితిలోనే ఉన్నారు.
దవడ భాగాలు బాగా దెబ్బతిన్నాయి. ముఖమంతా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది అని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన కోలాలంపూర్ హాస్పిటల్ లోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. ఆయన భార్య నిర్మాత ఫాతిమా ఇప్పటికే చెన్నై నుంచి కోలాలం పూర్ చేరుకుంది. ఆయనను కౌలాలంపూర్ నుంచి తీసుకుని వచ్చి చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేసి ముఖానికి సర్జరీ చేయించాలని ఆయన కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడని, ఆయనను స్పృహలోకి తీసుకుని రావడానికి వైద్యులు పలు విధాలుగా కృషి చేస్తున్నారని సమాచారం.
![]() |
![]() |