![]() |
![]() |

రాను రాను ఓవర్ సీస్ మార్కెట్ అనేది తెలుగు స్టార్ హీరోలకు బంగారు బాతు గుడ్డుగా మారుతోంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్ మన చిత్రాలకు కల్పవృక్షంలా మారి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కొంతకాలం కిందటి వరకు ఒక సినిమా హిట్టా కాదా అనేది ఆయా చిత్రాలు ఎన్ని సెంటర్లలో, ఎన్ని థియేటర్లలో అర్ధశతదినోత్సవం, శతదినోత్సవం, గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ ఆడిందనే దాని ప్రాతిపదికన ఆయా చిత్రాల సక్సెస్ రేటును నిర్ణయించేవారు. కానీ నేడు ఎన్ని వందల కోట్లను ఎంత తక్కువ సమయంలో సాధించింది అనే దానిమీద సినిమా ఫలితం, హీరోల ఇమేజ్ ఆధారపడి ఉంటోంది. మరి ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఏ హీరో చిత్రాలు 100 మిలియన్ల క్లబ్లో చేరాయి అనేదానిమీద ఇప్పుడు హాట్ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక విషయానికి వస్తే అమెరికాలో ఒక సినిమా వంద మిలియన్ డాలర్లు వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు.
కానీ మన హీరోలు చాలామంది ఇప్పటికే ఈ ఫీట్ ని ఒకటికి రెండుసార్లు సాధించి ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో రెండు మిలియన్ క్లబ్బులో చేరారు. ఈ జాబితాలో ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. ఆయన నటించిన నాలుగు చిత్రాలు రెండు మిలియన్ డాలర్లు కలెక్ట్ చేశాయి. అలాగే మహేష్ బాబుకి కూడా నాలుగు రెండు మిలియన్ల డాలర్ల చిత్రాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు మూడు ఉండగా, చిరంజీవికి వాల్తేరు వీరయ్య కూడా మూడో చిత్రం కావడం విశేషం. దాంతో ఆయన ఎన్టీఆర్ పక్కన చోటు సంపాదించారు. ఇక మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి వారు రెండేసి చిత్రాల చొప్పున రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాలతో తర్వాత స్థానాలలో ఉన్నారు.
వీరితో పాటు విజయ్ దేవరకొండ కి ఒక సినిమా, నితిన్, వెంకటేశ్‌లకు చేరో సినిమా ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా రెండు మిలియన్ డాలర్లు అమెరికాలో కలెక్ట్ చేయడంతో తన మెగా ఫ్యామిలీ హీరోలు అందరికంటే ఆయన ముందంజలో ఉన్నానని మరోసారి నిరూపించుకున్నారు. అయితే మహేష్ బాబు, ప్రభాస్ లు నాలుగు సినిమాలతో టాప్ లో ఉన్నారు. దాంతో చిరు ఎన్టీఆర్ తో కలిసి రెండో స్థానంలో నిలబడ్డారు.
![]() |
![]() |