![]() |
![]() |

చిత్రం : కాపా
తారాగణం: పృథ్వీరాజ్ సుకుమారన్, అపర్ణా బాలమురళి, అన్నా బెన్, అసిఫ్ అలీ, డిలీష్ పోతన్ తదితరులు.
సంగీతం: డాన్ విన్సెంట్, బెజోయ్.
సినిమాటోగ్రఫీ: జోమోన్ టి. జాన్.
ఎడిటింగ్: షమీర్ మహమ్మద్.
దర్శకత్వం: షాజీ కైలాస్.
నిర్మాతలు: డాల్విన్ కురియకోజ్, జిను వి. అబ్రహం, డిలీష్ నాయర్, విక్రమ్ మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్.
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
కథ: త్రివేండ్రంలో ఎప్పుడు జరిగే గ్యాంగ్ వార్స్ ని ఎదుర్కొనలేని పోలీసులు వారి చేతిలో కీలుబొమ్మలా మారిన వేళ.. అక్కడ కొత్తగా తీసుకొచ్చిన ఒక చట్టం 'కాపా'. క్రిమినల్స్ ని లేకుండా చేయడానికి తీసుకొచ్చిన ఈ చట్టంలో కొందరు అమాయకులు బలి అవుతూ ఉంటారు.
మొదట రోడ్డుపై కారు బోల్తాపడి.. అందులో నుండి ఒక అతను స్వల్ప గాయాలతో బయటకు వస్తాడు. అలా ఈ సినిమా మొదలవుతుంది. అతని పేరు ఆనంద్. భార్య బిను తివిక్రమన్ తో కలిసి కొత్తగా ఒక అపార్ట్మెంట్ లోకి వస్తారు. అయితే వాళ్ళు రీసెంట్ గా పెళ్ళి చేసుకొని ఉంటారు. వాళ్ళ అపార్ట్మెంట్ కి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి అందరి వివరాలు అడిగి తెలుసుకుంటాడు. అప్పుడు ఆ పోలీస్ కి ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే త్రివేండ్రం నుండి పారిపోయి వచ్చిన బిను గ్యాంగ్ లోని లిస్ట్ లో ఆనంద్ భార్య బిను తివిక్రమన్ ఉందని తెలుస్తుంది. ఆ పోలీస్ ఈ విషయం గురించి ఆనంద్ కి పర్సనల్ గా కలిసి చెప్తాడు. అయితే తన భార్య అమాయకురాలని, మేం రీసెంట్ గా ఇక్కడికి వచ్చామని ఆనంద్ చెప్తాడు. అయిన సరే అవేం ఇక్కడ పనిచేయవని ఆ పోలీస్ చెప్తాడు. మీరు బ్రతికి ఉండాలంటే త్రివేండ్రంలో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ కొట్ట మధు అని ఉంటాడు. అతను ఒక్కడే మిమ్మల్ని సేవ్ చేయగలడని.. అతన్ని చేరాలంటే ముందుగా అతని భార్య డిప్యూటీ కలెక్టర్ ప్రమీలను కలిసి జరిగిందంతా చెప్పమని చెప్తాడు. ఆనంద్ ప్రమీలని కలిసి జరిగిందంతా చెప్తాడు. ఇక ఆ తర్వాత కొట్ట మధు ఇన్వాల్వ్ అవుతాడు. "ఎందుకు వచ్చావ్? ఎవరు నిన్ను పంపించారు? ఎవరూ నిన్ను పంపించకుంటే నువ్వు సేఫ్. లేదంటే ఎక్కడికెళ్ళినా బ్రతకడం కష్టం" అని ఆనంద్ కి వార్నింగ్ ఇస్తాడు మధు. ఆ తర్వాత మధు నుండి ఆనంద్ ఎలా తన భార్య బిను తివిక్రమన్ ను కాపాడుకున్నాడు.. కాపా లిస్ట్ నుండి తన భార్య పేరుని తొలగించగలిగాడా? అని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ:
డైరెక్టర్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ కథని స్లోగా మొదలుపెట్టి కూడా ఇంటర్వెల్ కి వేగం పుంజుకుంది. మధ్యలో ఎలివేషన్ కోసం కొట్ట మధుకి ఫ్లాష్ బ్యాక్ సీన్లు జోడించాడు. ఆ సీన్లు కూడా అంతలా మెప్పించలేకపోయాయి. రెండు ఫైట్లతో పెద్ద గ్యాంగ్ స్టర్ అవుతాడనేది చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మూవీ క్లైమాక్స్ లో ఆనంద్ భార్య రివీల్ చేసే ట్విస్ట్ తో మరో పార్ట్ కి లీడ్ ఉండబోతుందని చెప్తూ అక్కడికి వదిలేసాడు డైరెక్టర్. అయితే ఈ మూవీ కథలాగా గ్యాంగ్ వార్స్ తరహాలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అదే కోవలోకి ఇప్పుడు 'కాపా' కూడా చేరింది. కథకి పెద్దగా స్కోప్ లేదనే చెప్పాలి.
నటీనటుల పనితీరు: ఆనంద్ పాత్రలో ఆసిఫ్ అలీ బాగా నటించాడు. కొట్ట మధు పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ తన మార్క్ ని చూపిస్తూ వన్ మ్యాన్ షో గా ఆకట్టుకున్నాడు. ఇక కొట్ట మధు భార్యగా ప్రమీల పాత్రలో అపర్ణా బాలమురళి పర్వాలేదనిపించింది. బిను తివిక్రమన్ పాత్రకి అన్నా బెన్ న్యాయం చేసింది. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక డైరెక్టర్ షాజీ కైలాస్ ఒక రొటీన్ కథని కమర్షియల్ మూవీగా తెరకెక్కించాడు.
తెలుగువన్ పర్స్పెక్టివ్: మూవీ స్టార్టింగ్ ఒక ఇంటెన్స్ తో మొదలుపెట్టినా, ఆ ఇంటెన్స్ మూవీలో ఎక్కడా కూడా కనిపించలేదు. గ్యాంగ్ వార్స్ ని ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చే ఈ సినిమా కామన్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.
రేటింగ్: 1.5 /5
✍️.దాసరి మల్లేశ్
![]() |
![]() |