![]() |
![]() |

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఏడు పదుల వయసులోనూ జోరు తగ్గించటం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం తలైవర్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన జైలర్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాక ముందే సూపర్‌స్టార్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అవి కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే కావటం విశేషం.
ఇంతకు ముందు రజినీతో ఇదే సంస్థ రోబో సీక్వెల్‌గా 2.0ను భారీ బడ్జెట్‌తో నిర్మించిన సంగతి తెలిసిందే. అదే పరిచయంతో ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ రెండింటిలో ఒక దానిలో ఆయన గెస్ట్ అప్పియరెన్స్‌లో కనిపించబోతున్నారు. అది కూడా ఆయన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లాల్ సలాం.
ఇక రెండో సినిమా సూర్యతో జై భీమ్ వంటి సెన్సేషనల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు టి.జె.జ్ఞానవేల్. నిజానికి ఈ డైరెక్టర్ సూర్యతోనే మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే సూర్య ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల.. రజినీకాంత్ ప్రాజెక్ట్‌ను టి.జె.జ్ఞానవేల్ సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు కోలీవుడ్ మీడియా టాక్.
![]() |
![]() |