![]() |
![]() |

తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభతో నిండి ఉన్నాయి. నగరాలకు, పట్టణాలకు పనుల కోసం వలస వెళ్లిన వారందరూ ఈ పండుగ సందర్భంగా తమ సొంత ఊర్లకు వచ్చి సంక్రాంతి వేడుకను వైభవంగా జరుపుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి అన్నిచోట్ల నగరాలు, పట్టణాలు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ సొంత ఊరిలో ఈ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. కోడిపందాలు, ఇంటిముందు పెద్ద పెద్ద ముగ్గులు, సంక్రాంతి హరిదాసులు, గొబ్బెమ్మలు, సినిమాల జాతరలు ఇలా ఈ పండుగ వైభవంగా సాగుతోంది. గత రెండు మూడేళ్లుగా కరోనా వల్ల ఇంత వేడుకగా ఈ పండుగలు జరిగి చాలా కాలం అయింది. ఆ లోటునంత ఈ ఏడాది సంక్రాంతితో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చికెన్, మటన్ల కోసం పోటీపడుతున్నారు. కమ్మని నాన్ వెజ్ వంటకాల కోసం అర్రులు చాస్తున్నారు.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన శ్రీమతి స్నేహారెడ్డితో కలిసి ఇద్దరు పిల్లలతో తమ ఊరిలో పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదే తరహాలో తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకొని అక్కడ నుంచి నారావారి పల్లెకు చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ కూడా నారావారి పల్లెలోనే ఉన్నారు.
ప్రతి ఏడాది నారావారిపల్లిలో ఫ్యామిలీ అంతా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. బాలకృష్ణ తో పాటు ఆయన సతీమణి వసుంధర, కుమారుడు కాబోయే హీరో నందమూరి మోక్షజ్ఞ అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ వేడుక వేళ నారా చంద్రబాబు నాయుడు సోదరుడు కుమారుడైన నారా రోహిత్ ఈ వేడుకలకు హాజరు కాలేదు. గత కొంతకాలంగా నారావారి పల్లెకు రావడం సంక్రాంతి సెలబ్రేషన్స్ లో భాగంగా నారా లోకేష్ తో కలిసి అక్కడి వారితో సరదాగా క్రికెట్ ఆడుతూ సందడి చేయడం నారా రోహిత్ కు అలవాటు. అయితే ఈ ఏడాది మాత్రం మిస్ అయ్యాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
కాగా ఈమధ్య వరుసగా నారా రోహిత్ పలు చిత్రాలను లైన్‌లో పెట్టాడు. బాణంతో 2009లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన 2018 వరకు వరుస చిత్రాలు చేస్తూనే వచ్చారు. ఏడాదికి మినిమం నాలుగైదు చిత్రాలు విడుదలయ్యేలా చూసుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన వెండితెరపై కనిపించి చాలా కాలమే అయింది. వీర భోగ వసంత రాయులు,ఆటగాళ్లు,బాలకృష్ణుడు, కథలో రాజకుమారి వంటి చిత్రాల తరువాత ఈయన చిత్రాలేమీ విడుదల కాలేదు. 2018లో చివరిసారిగా వీర భోగ వసంత రాయలతో ఆయన తెరపై కనిపించారు.
ప్రస్తుతం ఆయన నటించే నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి పండగలా వచ్చాడు అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆయనకు జోడిగా నీల ఉపాధ్యాయ నటిస్తుండగా కార్తికేయ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన నిర్మాతగా కూడా మారి శ్రీ విష్ణు హీరోగా 2014లో నలదమయంతి అనే చిత్రాన్ని నిర్మించే సంగతి తెలిసిందే. ఇక ఈయన స్వామి రారా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. గాయకుడిగా సావిత్రి చిత్రంలో ఓ పాట పాడారు.
![]() |
![]() |