![]() |
![]() |
.webp)
గత కొంతకాలంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిపి ఓ చిత్రం చేయనుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కాగా మైత్రి వారు ప్రభాస్‌తో చేసే చిత్రం 'వార్ 2' అయ్యుంటుందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ఇమేజ్ ఆకాశమే హద్దుగా సాగుతోంది. ఆయన ఎక్కడ తగ్గడం లేదు. జయాపజయాలకు అతీతంగా ఆయన స్టార్‌డం కొనసాగుతోంది. 'ఆది పురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కె'లతో పాటు మైత్రి బేనర్, దిల్ రాజు బేనర్లలో కూడా నటించడానికి ఒకే చెప్పారు. మరో వైపు మారుతి చిత్రం. ఇక దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ చేస్తున్నారు.
ఈ చిత్రాలతో ఆయన క్రేజ్ మరో లెవల్ కు తాకుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక 'ప్రాజెక్టు కే' సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సమయంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ భారీ ప్రాజెక్టును ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం 'వార్' నటుడు టైగర్ ష్రాఫ్.. ప్రభాస్ చిత్రంలో కీలకపాత్రను చేయనున్నాడట. సిద్ధార్థ ఆనంద్ తెరకెక్కించిన 'వార్' చిత్రంలో హృతిక్ రోషన్ తో కలిసి టైగర్ నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో దీనికి సీక్వెల్ గా 'వార్ 2' రానందని సమాచారం.
హృతిక్ రోషన్ స్థానంలో ప్రభాస్ నటించనుండగా, టైగర్స్ ష్రాఫ్ అదే పాత్రలో నటించనున్నాడని సమాచారం. ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాలతో బిజీగా ఉంటే టైగర్ ష్రాఫ్ సైతం ప్రస్తుతం 'బడే మియా చోటే మియా', 'గణపతి' వంటి భారీ చిత్రాలలో బిజీగా ఉన్నారు. ఇద్దరి కాల్ షీట్లు సింక్ అయితే ఒక మంచి డేట్ ను ఫిక్స్ చేసుకొని ఈ చిత్రాన్ని ప్రారంభించాలని మైత్రి మూవీ మేకర్స్ వారు ఆరాటపడుతున్నారు. ఈ ప్రాజెక్టు కొత్త సంవత్సరంలోనే ప్రారంభం కావాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
![]() |
![]() |