![]() |
![]() |

`గీత గోవిందం`(2018), `డియర్ కామ్రేడ్`(2019) చిత్రాల్లో జంటగా నటించారు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికా మందన్న. కట్ చేస్తే.. త్వరలో ఈ ఇద్దరు మరోమారు కలిసి సందడి చేయనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో `లైగర్` పేరుతో విజయ్ ఓ పాన్ - ఇండియా మూవీ చేసిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటించగా.. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, వెటరన్ యాక్ట్రస్ రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. కాగా, కథానుసారం ఈ సినిమా ద్వితీయార్ధంలో ఓ ప్రత్యేక గీతానికి స్థానముందట. అందులో రష్మిక మెరవనుందని సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే ఈ పాట తాలూకు చిత్రీకరణ కూడా పూర్తయిందని బజ్. త్వరలోనే `లైగర్`లో రష్మిక స్పెషల్ సాంగ్ పై క్లారిటీ రానుంది. మరి.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ రష్మిక సందడి చేయనున్న ఈ ప్రత్యేక గీతం తనకి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
కాగా, `అర్జున్ రెడ్డి` (2017) విడుదల తేది అయిన ఆగస్టు 25ని టార్గెట్ చేసుకుని ఈ ఏడాది `లైగర్` జనం ముందుకు రాబోతోంది.
![]() |
![]() |