![]() |
![]() |

`బ్లాక్ కామెడీ` జానర్ లో తెరకెక్కిన `కోలమావు కోకిల` (తెలుగులో `కోకోకోకిల`), `డాక్టర్` (తెలుగులో `వరుణ్ డాక్టర్`) చిత్రాలతో తమిళనాట బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. అయితే, అతని మూడో సినిమాగా రూపొందిన `బీస్ట్` మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో.. రాబోయే చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు నెల్సన్.

`తలైవర్ 169` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని.. సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో తీయబోతున్నాడు నెల్సన్. త్వరలో పట్టాలెక్కనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. 2023 ప్రథమార్ధంలో సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చే అవకాశముంది. కాగా, `తలైవర్ 169` సెట్స్ పైకి వెళ్ళకముందే మరో అగ్ర కథానాయకుడితో కలిసి పనిచేసే ఛాన్స్ దక్కించుకున్నాడట నెల్సన్. ఆ స్టార్ మరెవరో కాదు.. రజినీకాంత్ మాజీ అల్లుడు, వెర్సటైల్ స్టార్ ధనుష్. రీసెంట్ గా ధనుష్ కి ఓ స్టోరీ లైన్ వినిపించాడట నెల్సన్. అది నచ్చడంతో ధనుష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ బజ్. అంతేకాదు.. 2023 ఆరంభంలో ఈ సినిమా ప్రారంభం కానుందని వినికిడి. త్వరలోనే ధనుష్ - నెల్సన్ కాంబో మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ధనుష్ చేతిలో `ద గ్రే మ్యాన్` (ఇంగ్లిష్), `నానే వరువేన్`, `తిరుచిత్రాంబలం`, `సార్` (వాత్తి) (తెలుగు - తమిళ్ బైలింగ్వల్ మూవీ) చిత్రాలున్నాయి.
![]() |
![]() |