![]() |
![]() |

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ తరం కథానాయికల్లో సమంత ఒకరు. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ కాశ్మీర్ యువతిగా దర్శనమివ్వబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. `నిన్ను కోరి`, `మజిలీ`, `టక్ జగదీశ్` చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ.. త్వరలో ఓ రొమాంటిక్ డ్రామాని తెరకెక్కించనున్నారు. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంత జోడీగా నటించనున్నారని ఇప్పటికే కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో కాశ్మీర్ యువతి పాత్రలో సామ్ కనిపించనుందట. ప్రేమికురాలిగా, గృహిణిగా రెండు ఛాయలున్న శక్తిమంతమైన పాత్ర ఇదని టాక్. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. ఆర్మీ మ్యాన్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్నాడని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, విజయ్ దేవరకొండ - సమంత - శివ నిర్వాణ కాంబో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా.. కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకోనుందట. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ `ఖుషి` (2001) టైటిల్ ని ఈ చిత్రం కోసం రిపీట్ చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోందని బజ్.
![]() |
![]() |