![]() |
![]() |

తెలుగునాట వరుస విజయాలతో ముందుకు సాగుతున్న దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఒకరు. తన రెండో సినిమా `బృందావనం` మొదలుకుని `ఎవడు`, `ఊపిరి`, `మహర్షి` వరకు వరుసగా నాలుగు జనరంజక చిత్రాలను తెరకెక్కించి వార్తల్లో నిలిచారాయన. కట్ చేస్తే.. ప్రస్తుతం కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ కాంబినేషన్ లో తన నెక్స్ట్ వెంచర్ ని తీర్చిదిద్దుతున్నారు వంశీ. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తయారవుతోంది.
ఇదిలా ఉంటే.. `దళపతి 66` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. రంజాన్ స్పెషల్ గా మే 2న `దళపతి 66` ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారట. అంతేకాదు.. మే 2తో దర్శకుడిగా వంశీ పైడిపల్లి 15 ఏళ్ళు పూర్తిచేసుకోబోతున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కూడా ఈ ఫస్ట్ లుక్ ని ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే `దళపతి 66` ఫస్ట్ లుక్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, `దళపతి 66`లో విజయ్ కి జోడీగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న నటిస్తోంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |