![]() |
![]() |
.webp)
సినిమాలలో పెద్ద పెద్ద స్టార్స్ నటించిన సీన్స్ కూడా కొన్ని ఎడిటింగ్ లో పోతుంటాయి. అయితే పూర్తిగా వాళ్ళు పోషించిన రోల్ నే ఎడిటింగ్ లో తీసేయడం చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా 'ఆచార్య' సినిమా విషయంలో అదే జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ రోల్ ని పూర్తిగా లేపేశారని ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో రామ్ చరణ్ నటించాడు. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జోడీగా పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటించారు. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో కాజల్ ఒక్క షాట్ లో కూడా కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. అసలు ఈ సినిమా నుంచి కాజల్ సీక్వెన్స్ మొత్తాన్ని డిలీట్ చేశారని ప్రచారం జరుగుతోంది. అందులో ట్రైలర్ లో కాజల్ కనిపించలేదని, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ ఈ సినిమా రిలేటెడ్ పోస్ట్ లు కూడా అందుకే పెట్టలేదని అంటున్నారు.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఆచార్య సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మెగా మూవీ ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాలో కాజల్ పాత్ర ఉందో లేదో ఆరోజు తేలిపోనుంది.
![]() |
![]() |