![]() |
![]() |

`డీజే టిల్లు`తో కథానాయికగా తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది నేహా శెట్టి. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించబోతోందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ - ఇండియా మూవీగా రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ అధినేత శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ భారీ బడ్జెట్ మూవీ.. సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో ఇద్దరు నాయికలకు స్థానముందని బజ్. అందులో ఒకరిగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా.. మరొకరిగా `డీజే టిల్లు` భామ నేహా శెట్టిని ఎంపిక చేశారని టాక్. త్వరలోనే రామ్ - బోయపాటి శ్రీను కాంబో మూవీలో నేహా శెట్టి ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, రామ్ ప్రస్తుతం `ద వారియర్` చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా రూపొందుతున్న ఈ కాప్ డ్రామాని.. కోలీవుడ్ కెప్టెన్ లింగు స్వామి తెరకెక్కిస్తున్నాడు. కృతి శెట్టి నాయికగా నటిస్తున్న ఈ చిత్రం.. జూలై 14న రిలీజ్ కానుంది.
![]() |
![]() |