![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఒకే ఏడాదిలో రెండేసి సినిమాలతో సందడి చేసి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో 2009లో `బిల్లా`, `ఏక్ నిరంజన్` చిత్రాలతో చివరిసారిగా అలా ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఎంటర్టైన్ చేశారు ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో. కట్ చేస్తే.. ఈ సంవత్సరం ఆ ఫీట్ మరోమారు రిపీట్ కానుందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాదిలో ఇప్పటికే `రాధే శ్యామ్`తో పలకరించిన ప్రభాస్.. కుదిరితే దీపావళి సీజన్ లో మరో మూవీతో వినోదాలు పంచే దిశగా ఉన్నారని బజ్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ప్రభాస్ ఓ హారర్ కామెడీ మూవీ చేయబోతున్నట్లు కొన్నాళ్ళుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని కేవలం 50 రోజుల్లో పూర్తి చేసే దిశగా టార్గెట్ ఫిక్స్ చేశారట ప్రభాస్. అలాగే.. దీపావళి స్పెషల్ గా అక్టోబర్ ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం ప్రభాస్ చేతిలో `ఆదిపురుష్`, `సలార్`, `ప్రాజెక్ట్ కె`, `స్పిరిట్` చిత్రాలున్నాయి. వీటిలో `ఆదిపురుష్`, `సలార్` 2023లో సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నాయి. మరోవైపు మారుతి తాజా సినిమా `పక్కా కమర్షియల్` జూలై 1న రిలీజ్ కానుంది.
![]() |
![]() |