![]() |
![]() |

`ఆర్ ఆర్ ఆర్`తో జాతీయ స్థాయిలో నటుడిగా ప్రశంసలు పొందాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. త్వరలో చరణ్ .. `ఆచార్య`తో పలకరించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించిన ఈ సోషల్ డ్రామా.. ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమైంది.
ఇదిలా ఉంటే, చరణ్ ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీ.. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతోందని సమాచారం. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో.. చరణ్ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నట్లు బజ్. కాగా, తొలుత ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని 2023 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు కథనాలు వచ్చాయి. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. 2023 వేసవిలో చరణ్ - శంకర్ కాంబో మూవీ రిలీజ్ కాబోతోందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, `#RC15` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వాని నటిస్తుండగా.. శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. యువ సంగీత సంచలనం తమన్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |