![]() |
![]() |

'అఖండ' సినిమాతో సంచలన విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బాలయ్య కెరీర్ లో 107 వ సినిమాగా తెరకెక్కుతున్న దీనిని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి 'అన్నగారు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
బాలయ్య సినిమాలు లాగే టైటిల్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అందుకే #NBK107 కోసం గోపీచంద్ పలు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు 'అన్నగారు' టైటిల్ తెరపైకి వచ్చింది. దివంగత నటుడు ఎన్టీఆర్ ని తెలుగువారు అన్నగారు అని పిలిచేవారు. ఆ పేరు ఈ మూవీకి సరిగ్గా సరిపోతుందని భావించిన టీమ్.. #NBK107 కి 'అన్నగారు' అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |