TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పాపం జంబులింగం
వసుంధర
టెలికమ్యునికేషస్స్ జనరల్ మేనేజర్ జంబులింగం తన పదవిలోకి వచ్చేక డిపార్ట్మెంట్లో ప్రవేశపెట్టిన మార్పుల గురిండ్చిసాదించిన అభివృద్ధి గురించి తన క్రింది ఉద్యోగికీ ఉపన్యాస రూపంలో చెబుతుండగా ఫోన్ మ్రోగింది.
ఆయన వెంటనే రిసివరందుకుని హలో! టెలికమ్యునికేషస్స్ జనరల్ మేనేజర్ అన్నాడు. పేరుకు ముందు తన హోదాను తగిలించడం ఎన్నడు మరువని కారణంగా చాల మందాయన ఇంటిపేరు టెలికమ్యునికేషస్స్ జనరల్ మేనేజర్ అని పోరాబడుతుంటారు.ఇంట్లో వాళ్లయితే ఇంటి పేరు మరచిపోయారు.
“నమస్కారం సార్! ణా పేరు విఇర వెంకట సత్యనారాయణ. అర్జెంటుగా మీరు ణా ఫిర్యాదు వినాలి సార్! అంటూ తన ఇంటి చిరునామా,ఫోన్ర్ నెంబర్ చెప్పి – మా ఫోన్ర్ తిన్నగా పనిచేయడంలేదు సార్ అన్నాడు ఫోన్లో మాట్లాడుతున్న అవతలి వ్యక్తీ.
ఇలాంటి కంప్లయింట్స్ జంబు లింగానికి కొత్తకాదు అయన వెంటనే “సరే మీ వివరాలు నోట్ చేసుకున్నాను. మావాళ్ళు వస్తారు అని ఫోన్ పెట్టేశాడు. అయన క్రిది ఉద్యోగి కుతూహలంగా ఎవరు సార్ ఫోన్ చేస్తా? అనడిగాడు ఆ ఏదో పర్సనల్ కాల్ లెఅన్నాడు జంబులింగం అంతవరకూతను సాదించిన అభివృద్ధి గురించి చెబుతున్నమూలానా జంబులింగానికి ఫిర్యాదు గురించి క్రింది ఉద్యోగికి చెప్పడానికి సమయం కాదనిపించింది.
ఆ సాయంత్రం జంబులింగం ఇంటికి అతిథులోచ్చారు డిపార్ట్మెంట్లోతను సాదించిన విశేషాలగురించి ఆయన వారికి వివరిస్తుండగాఫోన్ వచ్చింది సాదారణంగా ఎప్పుడు ఫోనుకు పక్కకగా కూర్చోవడం జంబులింగం అలవాటు అందుకని ఆయన వెంటనే రిసివారెత్తి –“ హలో టెలికమ్యునికేషస్స్ జనరల్ మేనేజర్ జంబులింగం స్పీకింగ్” అన్నాడు జంబులింగం గార నమస్కారం సార్ – నాపేరు వీర వెంకట సత్యనారాయణ నా ఫిర్యాదు విషయమేమ్చేసారు సార్ అన్నాడు అవతలి వ్యక్తీ.
మావాళ్ళు రాలేదా అన్నాడు జంబులింగం చిరాగ్గా... వచ్చారు సార్ అరగంటసేపు నా టెలిఫోన్తో ఆదుకునిఏ లోపము లేదని చెప్పి వెళ్ళి పోయారు.... అయితే వాళ్ళు చెప్పిందే నిజం అని ఫోన్ పెట్టశాడాయన.
తన మతమేరకు తన డిపార్టుమెంట్ మనుష్యులువెంటనే వేల్లినదుకు రవంత గర్వంకుడా కలిగి తనలో తనేముసిముసిగా నవ్వుకున్నాడుఏమిటి సార్ అనడిగారు అతిధులు కుతూహలంగా ఏమిలేదు మా డిపార్టుమెంట్ ను మెచ్చుకుంటూ ఎవరో ఫోన్ చేసారుఏది నాకు మాములే అన్నాడు జంబులింగం.
మర్నాడు బైటేక్కడో అఫీషియల్ మీటింగ్ ఆ రోజే కూతురి పెళ్ళికోసం చూపులకొచ్చినవారు నిర్ణయం తెలియబరుస్తారుకబురు తీసుకుని బావమరిది పదకొండింటికి రావలి కబురు తెలియగానే నాకు ఫోన్ చేయండి అని ఆయన భార్యకు ఫోన్ నెంబర్ రిచ్చివెళ్ళాడు.
మీటింగ్ లో ఉండగా అక్కడ తను ఫోన్ దగ్గరే నే కూర్చుని సరిగ్గా పదకొండు గంటల ప్రాంతంలో తనకు ఫోన్ వస్తుంది అని మిగితా వారికి చెప్పదు మీటింగ్ పదిగంటలకు ప్రారంభమైంది వివిధ సంస్థలకు సంబంధించిన అధినేతలు డిపార్టుమెంటు నిర్వహించడంలో తమకున్న సమస్యలగురించి చెప్పుకుంటన్నారు.
కాసేపటికి జంబులింగం కలగజేసుకుని తను డిపార్టుమెంట్లో సాధించిన ఘనవిజయలగురించి చెబుతుండగా బల్లమీద ఫోన్ మ్రోగింది తను టైం చూసుకున్నాడుపదకొండు అయిదైంది.
బావమరిది వచ్చేశాడనమాట ఏం కబురు తెచ్చాడో – అనుకుంటూ రిసివారెత్తి హలో ! టెలికమ్యునికేషస్స్ జనరల్ మేనేజర్ జంబులింగం స్పీకింగ్ అన్నాడు జంబులింగం మీరేనా సార్ నమస్కారం నాపేరు వీరవెంకట సత్యనారాయణ మీకు గుర్తుండే ఉంటాను నా ఫిర్యాదు విషయం ఏంచేసారు సార్ మా వాళ్ళు వచ్చి చూసారుగా కొన్నాళ్ళు వేచి చూడండి ఏం వేచి చూడండి.
మా చెల్లయిని అత్తరు మాఇంటికి రానివ్వడంలేదు మా బావ మంచివాడేకాని ఏమిచేయలేక ఫోన్లో మాట్లాడుకోందని సలహా ఇచ్చాడు.ఇప్పటికి ముప్పైసార్లు ఫోన్ చేశానుముప్పైరోజుల్లో ఒక్కసారి దొరకదే ఆ నెంబరు దొరకదే! అందవతలి గొంతు అసహనంగా... నేను నమ్మను ఫిర్యడుచేయడం మికలవాటైఉంటుంది.
నేనిక్కడుంటే అక్కడికి వెతుకుంటూఫోన్ చేస్తున్నారు ఏది మర్యాద కాదు నిజం చెప్పాలంటే నాకు మీ నెంబర్ తెలియదు సార్... నేను మాచెల్లయికి ఫోన్ చేయలన్నపుడల్లా ఏదో రాంగ్ నెంబర్ తగుల్తోంది ముప్పైసార్లలో మూదుసార్లు మీ నెంబర్ తగిలింది ఎలాగో తగిలింది కదా అనిఒక ఫిర్యాదు చేస్తున్నాను....అందవతలిగొంతు దీనంగా.... జంబులింగం ముఖం అదోలగైపోయింది. ఏమిటివిసేశం అన్నాడు పక్కనున్న వ్యక్తీ పాపం జంబులింగం ఏంచెప్తాడు...