జబ్బులకు జన్మస్థానం నీ ఉదరమే?
నీవు ఆరోగ్యంగా వుండాలంటే
నీవు ఆనందంగా వుండాలంటే
నీవు రోగాలకు దూరంగా వుండాలంటే
నీవు మొదట కన్ను వేయవలసింది
నీవు నిఘాపెట్టవలసింది
నీవు కాపాడుకోవలసింది నీ కడుపును
చెత్త కుండీలో ఏదో చెత్త వేసినట్లు
నీవు ఏమేమి చెత్త తింటున్నావో
నీ కడుపులోనికి ఏమి వెళ్తుందో నీవు గమనించాలి
నీ కళ్ళను నీ మనసును
నీ కడుపు మీదనే కేంద్రీకరించాలి
నీ నాలుకను కట్టడి చేయాలి
చెత్తకుండీ చుట్టూ దుర్గంధమే
పూలకుండీ చూట్టూ పూలపరిమళమే
జబ్బులకు జన్మస్థానం నీ ఉదరమే
అందుకే నీ కడుపును పూలకుండీగానో
చెత్త కుండీగానో మార్చుకోవడం మాత్రం
నీ చేతుల్లోనే వుంది. జరా జాగ్రత్త మిత్రమా



