1. వ్యాపారంలో మొహమాటం అసలుఉండకూడదు
2. కాస్త కఠినంగా ఉండాలి మెతకతనం పనికిరాదు
3. దేనికీభయపడకూడదు కానీ కాస్త దూకుడుగా ఉండాలి
4. అందరినీ అనుమానించకు కూడదు
5. వేగవంతమైన వివేకవంతమైన కఠినమైన కచ్చితమైన నిర్ణయాలు
సమయస్ఫూర్తితో సకాలంలో తీసుకోవాలి
6. కోపం పతనానికి
శాంతి సంతోషానికి సోపానం
7. ఎంత ఎక్కువ కష్టపడితే
అంతచక్కని ఫలితం దక్కుతుంది
8. నమ్మకస్తులైనవారిని
పొగడాలి ప్రోత్సహించాలి
9. అందర్నీ ఆహ్లాదపరిచే
గెట్ టు గెదర్ ఏర్పాటు చేయాలి
10. వ్యక్తిగత కుటుంబసభ్యుల
అవసరాల్లో ఆపద్బాంధవునిగా ఆదుకోవాలి
11. ఎక్కువ శ్రమపడే
వారిని గుర్తించి సత్కరించాలి
12. బద్దకస్తులకను హెచ్చరిస్తూ
ఉండాలి భయపెట్టాలి
13. ఎదిరించి మాట్లాడే
వారిని విమర్శించే వారిని
విషబీజాలు నాటేవారిని
దూరంగా ఉంచాలి
వారికి ప్రాధాన్యత
తగ్గించాలి లేదా తీసివేయాలి
14. స్నేహపూర్వకమైన
పోటీలు పెట్టాలి పాల్గొనాలి
15. ఎక్కువ లాభాలు వస్తే
సహచరులకు పంచి పెట్టాలి
16. కొంత లాభం పేదలకు
దైవకార్యాలకు వెచ్చించాలి
17. పెట్టిన పెట్టుబడికి వచ్చే లాభాల్ని ...మార్పుల్ని...
అనుకోని అవరోధాలను
అంచనా వేయాలి
18. ప్రక్కసంస్థల బలాలను
బలహీనతలను గమనించాలి
19. సంస్థ పురోభివృద్ధికి
కొత్త మార్గాలను అన్వేషించాలి
కొత్త ఐడియాలను ఆహ్వానించాలి
20. అతిగా ఆశపడరాదు ఆవేశ పడరాదు



