Facebook Twitter
అజంతా శిల్పం...?

ఈ మనిషి బ్రతుకు
"బండ రాయి" కాదు
అది అందమైన...
అత్యద్భుతమైన... 
అతి సుందరమైన...
ఓ "అజంతా శిల్పం" 

ఈ మనిషి బ్రతుకు
"బంగారు ముద్ద" కాదు
అది అతిఖరీదైన...
అపురూపమైన...
"అందమైన ఓ ఆభరణం"

ఈ మనిషి బ్రతుకు
ఇంటి"వంటసరుకు" కాదు
అది "సప్తరుచుల సమ్మేళనం"

ఈ మానవజన్మ ఎంతో
ఉన్నతమైనది...
ఉదాత్తమైనది...
ఉత్కృష్టమైనది...
అది"కోటి జన్మల పుణ్యఫలం"