కనుక్కోవడమెలా?
నిన్న చిన్న సహాయం
చేస్తామని మాటిచ్చి
నేడామాటను మరచిన
మన ప్రాణమిత్రులు
బద్దకస్తులా ? భయస్తులా?
భార్యాబాధితులా?
డిసెషన్ మేకేర్సా?
డిపెండెంట్సా?
నమ్మదగినవాల్లా?
నాటకాల రాయుల్లా?
ఇచ్చిన మాట మీద
నిలబడే సత్యహరిశ్చంద్రులా?
పూటపూటకు మాట
మార్చే మాయల మరాఠీలా?
కమ్మని కబుర్లు
కథలు చెప్పే కంత్రీలా?
అబద్దాలకోరులా ?
వాయిదాల వీరులా?
ఉత్తుత్తి ప్రగల్పాలూ
పలికే ఉత్తరకుమారులా?
కాల్ చేస్తే కట్ చేసి రేపుమాపని
తప్పించుకుని దొరల్లా తిరిగే దొంగలా?
కనుక్కోవడమెలాగో కాస్త చెప్పండి ప్లీజ్ ?



