Facebook Twitter
నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ నూతన ఓ నా ఆత్మీయ‌మిత్రులారా సంవత్సరంలో
ఆ దైవం తన కృపా
కరుణా కటాక్షములు
మీ అందరిపై సమృద్దిగా
కుమ్మరించును గాక !...

మీకు మంగళకర సకల
శుభకర శుభములు సిద్దించును గాక !..

మీ ఉజ్వలమైన
భవిష్యత్ ప్రజ్వలించును గాక !

ఆ దైవం నిత్యం మీకు తోడుగా నీడగా
కొండంత అండగా వుండును గాక !...

మీ "కష్టాలను" కరిగించును గాక !
మీ "కన్నీళ్ళను" తొలిగించును గాక ! ...

మీ భయాలను
"బాధలను" బంధించును గాక ! ...
మీకు "ఆనందనిధులను"
అందించును గాక !...

మీ ముఖాలలో చిరునవ్వుల
దివ్వెలను వెలిగించును గాక ! ...

మీకు అంతులేని
సుఖసంతోషాలను కలిగించును గాక ! ...

మీరు చేసే ప్రతిపనిని
మీరు వేసే ప్రతిఅడుగుని
మీరు తీసుకునే ప్రతినిర్ణయాన్ని
దీవించును గాక!
మీరు తలపెట్టిన
ప్రతికార్యము సఫలమౌను గాక!

ఆ దైవం మీ విఘ్నాలను తొలిగించి
మీకు "విజయాలవిందును"
అందించును గాక !

ఆయురారోగ్య సౌభాగ్యాలను
అష్టైశ్వర్యాలను సిరిసంపదలను
ప్రశాంతమైన జీవితాలను మీకు ప్రసాదించును గాక !...

ఈ నూతన సంవత్సరంలో...
ఇదే నా ఆశ... ఇదే నా ఆకాంక్ష...
జరిగిన సంవత్సరానికి
"జనగణమణ" పాడుతూ...
వచ్చే సంవత్సరానికి
"వందేమాతరం" ఆలపిస్తూ...
మీ అందరికీ నూతన
సంవత్సర శుభాకాంక్షలతో...