Facebook Twitter
కొత్త సంవత్సరం వస్తుంది!

కొత్త సంవత్సరం వస్తుంది!
వంద వసంతాల
సంతోషాల సంబరాలనందిస్తుంది
వేయి వెన్నెలల హాయి నిస్తుంది
కోటి సూర్యప్రభల కాంతిని తెస్తుంది...

కొత్త సంవత్సరం వస్తుంది !
పచ్చని మీ బ్రతుకుల్లో
నిత్యం వెలుగుల్ని నింపి
ఏ చీకూ చింతలేని
ఏ కలతలు కన్నీళ్ళురాని
ప్రశాంతమైన జీవితాన్ని
మీకు ప్రసాదిస్తుంది...

కొత్త సంవత్సరం వస్తుంది !
చిరునవ్వుల్ని సిరిసంపదల్ని
భోగభాగ్యాలను శాంతిసౌభాగ్యాలను
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను
మీకు అందిస్తుంది...

అప్పుడిక మీ జీవితం
ప్రతి దినం...         దీపావళే...
ప్రతి ఉదయం...   ఉగాదే...
ప్రతి సాయంత్రం.. సంక్రాంతే...
ప్రతి రాత్రి...         నవరాత్రే...