కవితలు మానేసి పావురాల
వెంటపడి అనేక అవస్థలుపడి
అష్టకష్టాలుపడి ఈ ఫోటోతీశా...
అవి మనలా కుదురుగా కూర్చోవుగా...
నిక్కినిక్కి చూస్తాయి...
నీకు నాకు చిక్కనంటాయి...
ఒంటరిగా దొరుకుతాయి...
కానీ జంటగా దొరకడం అసాధ్యం...
మనల్ని నమ్మవు...మనుషుల్ని చూస్తే
చాలా భయపడిపోతాయి...
ఎక్కడికో ఎగిరిపోతాయి...
ఫోటోకు ఫోజులివ్వవు...
తిండికోసమే తిరుగుతూవుంటాయి...
పిడికెడు గింజలు విసిరితే చాలు...
పిలవని అతిథుల్లావస్తాయి...
గుర్రుగా చూస్తాయి...
చకచకా తినేసి తుర్రుమంటాయి...
పాపం ఫోటోకి ఫోజులివ్వవు...
తినే తిండి మీదనే ధ్యాసంతా...
పొంచివున్న ప్రమాదాల మీదనే మనసంతా....
ఎవరిమీద ఆధారపడని
ఆ పావురాల ఆకలి వేట...
బద్దకస్తులకు...సోమరిపోతులకు...
పరులమీద ఆధారపడి బ్రతికేవారికి...
పావురాలు నేర్పుతాయి
ఎన్నోపాఠాలు,జీవితపాఠాలు...
గుణపాఠాలు...
జగడాలమారి ఏజంటకైనా
కుదురుగా కూర్చున్న
ఈ పావురాలజంటే స్పూర్తిఅంట
ఇది పచ్చి నిజమంట....



