కొన్నిసార్లు
ఎన్ని సుముహూర్తాలు చూసి
వేదమంత్రాలమధ్య వేదపండితుల మధ్య
మేళతాళాల మధ్య మంగళవాయిద్యాల మధ్య
మాంగళ్య ధారణ చేయించినా
అందరూ అక్షింతలు చల్లి ఆశీర్వదించినా
అంగరంగవైభవంగా వివాహాలు జరిపించినా
పదికాలాల పాటుండే పచ్చని కాపురాలు కొన్నే
దైవం దీవించిన దంపతులు కొందరే
ఆపై ప్రేమ తరిగి అపార్థాలు పెరిగి
చిచ్చురేగిన పచ్చని కాపురాలు
మూడునాళ్ళముచ్చట కావచ్చు
విడాకుల వరకు వెళ్ళవచ్చు విచ్చిన్నమైపోవచ్చు
ఇంట్లోనేవుంటూ ఇష్టంలేని కాపురాలు చేయవచ్చు
మనం మనజీవితంలో
శాడిస్ట్ భార్యలతో, మొండిఘటాలతో
అమాయకపు భర్తలను మోసంచేసి
బజారులో బలాదూరుగా తిరిగే
తిరుగుబోతు భార్యలతో
గయ్యాలిగంపలతో కాపురం చేయడం
గతజన్మలో చేసిన పాపాలకు ప్రతిఫలితం
కానీ వీరితో పాటుగా
గాడిదలతో, గబ్బిలాలతో
గజ్జికుక్కలతో, గుంటనక్కలతో
విషసర్పాలతో,తోడేళ్లతో
చిరుతపులులతో, చీడపురుగులతో
బురదలో పొర్లే పందులతో
మనుష్యుల రూపంలోవుంటూ
మనచుట్టూర తిరిగే అనేక
అడవిమృగాలతో కూడ
కాపురం చేయక తప్పదు
అట్టి వారితో కాపురం చేయాలవధ్దా అనే
గట్టినిర్ణయం తీసుకోవలసింది నీవే
కాదంటే కాలమే నిర్ణయిస్తుంది
ఔను ఆడవాళ్ళతో కాపురం చేసినవాళ్లు
అభివృద్ధి చెందవచ్చు అడుక్కుపోవచ్చు,
లేదా అడుక్కుతినవచ్చు,
కాని
అడవిమృగాలతో కాపురం చేసినవారు
నేడు ఎవరెస్టుశిఖరం ఎక్కికూర్చున్నా
రేపు వారు పరుండేది మాత్రం పాతాళంలోనే



